అమరావతి: గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను మంగళగిరి పోలీసులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. సుమారు గంటా నలభై నిమిషాల పాటు జోగి రమేష్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఆ రోజు దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వాహనాల్లో వచ్చారు? ఎంత మంది దాడిలో పాల్గొన్నారు? ఎవరి ఆదేశంతో దాడికి పాల్పడ్డారు? దాడికి ముందస్తు ప్రణాళిక రచించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. జోగి రమేష్‌తో పాటు ఆయన డ్రైవర్ తాండ్ర రాముని కూడా పోలీసులు ప్రశ్నించారు.