అమరావతి,చైతన్యరథం: తొలి జాబి తాలో టిక్కెట్లు రాని వారు, సీట్లు ప్రకటిం చని స్థానాల ఆశావావహులు టీడీపీ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడును మంగళవారం ఆయ న నివాసంలో కలిశారు. సీటు కోల్పొయి న అభ్యర్ధులను బుజ్జగించి రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబుతో తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ భేటీ అయ్యారు. తంబళ్లపల్లి స్థానాన్ని జయ చంద్రారెడ్డికి కేటాయించారు. సర్వే ద్వారానే జయ చంద్రారెడ్డికి సీటు కేటాయించామని, ఆయన విజయానికి సహకరించాలని శంకర్‌యాదవ్‌కు చంద్రబాబు నచ్చ చెప్పారు.
తొలి జాబితాలో సీటుదక్కని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగే శ్వరరెడ్డి చంద్రబాబును కలిశారు. మడక శిర నేత తిప్పేస్వామి కూడా చంద్రబాబు తో భేటి అయ్యారు. పార్టీ ప్రకటించిన అభ్యర్ధి కోసం పని చేయాలని, భవిష్యత్ లో అందరికీ తగిన గుర్తింపునిస్తానని చంద్రబాబు వారి హామీనిచ్చారు. శింగన మలకుచెందిన కేశవరెడ్డి, నర్సానాయుడు కూడా చంద్రబాబును కలిశారు. విభేదా లను పక్కనపెట్టి ఇక్కడ సీటు ఇచ్చిన బండారు శ్రావణి విజయానికి కృషి చేయాలని వారికి చంద్రబాబు సూచిం చారు. మరో ఇంకా సీటు ప్రకటించని స్థానాల ఆశావాహులు కూడా చంద్ర బాబును కలిశారు.
కడప లోక్‌సభ సీటు ఆశిస్తోన్న కడప పార్లమెంటు పార్టీ అధ్య క్షుడు శ్రీనివాసులురెడ్డి చంద్రబాబును కలిశారు. మరోవైపు గుంటూరు`2 స్థానానికి టీడీపీ ఇన్‌ఛార్జీగా ఉన్న కోవెల మూడి రవీంద్ర కూడా వచ్చి కలిసారు. ఈయనతోపాటు ఇదే సీటు అశిస్తున్న ఆలపాటి రాజా కూడా చంద్రబాబును కలిశారు. అనంతపురం లోక్‌సభ సీటు అశిస్తున్న జేసీ పవన్‌రెడ్డి కూడా వచ్చి కలిశాడు. కాగా ఇప్పటికే అనంతపురం ఎంపీ సీటులో పోటీ చేయాలని చంద్రబాబు బీకే పార్థసారధికి సూచించారు.
చంద్రబాబుతో నర్సారావుపేట ఎంపీ లావు భేటి
తెలుగుదేశం అధినేత చంద్రబాబును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో ఆయన తెదేపాలో చేరనున్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు వెల్లడిరచారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తున్నానని తెలిపారు. ఇదే విషయమై భేటీలో ఎంపీ చర్చించినట్లు సమాచారం.