- రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఈసీ తక్షణమే దృష్టి పెట్టాలని వినతి
- పార్టీ కార్యకర్తలు మునయ్య, ఇమామ్ హుస్సేన్ హత్యలను ఖండిరచిన టీడీపీ అధినేత
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 50రోజుల్లో కుర్చీ దిగి ఇంటి కి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీ యాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు. ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తు న్నాయన్నారు. ‘‘ప్రజాగళం సభకు వచ్చారన్న కార ణంతో గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మునయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రి లో ఇమామ్ హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి.
వైసీపీ గూండాల హత్యా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నా.బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ముగ్గురూ వైసీపీకి అత్యంత అనుకూలమైనవారే. వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు ఎస్పీల అండ చూసుకునే వైసీపీ గూండాలు చెలరేగుతున్నారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై తక్షణం దృష్టి సారించాలి. ఎన్నికల ముంగిట పెచ్చరిల్లుతున్న రాజకీయ హింస, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.
టీడీపీ కార్యకర్త హత్య
గిద్దలూరు: వైసీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త మునయ్య మృతిచెందారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో సోమవారం ఆయనపై వైసీపీ కార్యకర్తలు గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని తొలుత గిద్దలూరు నుంచి కర్నూలుకు… ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మునయ్య అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. బొప్పూడి వద్ద గత ఆదివారం జరిగిన ప్రజాగళం సభకు వెళ్లాడనే అక్కసుతో మునయ్యపై వైసీపీ కార్యకర్తలు గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.