అమరావతి: పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గంలో పోలింగ్ బూత్‌ల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశామని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. ఆ నియోజకవర్గం లో ఫ్యాక్షన్ ప్రభావం అధికమని, ఇప్పటికే ఆ ప్రాంతం లో ఫ్యాక్షన్ ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యా యని, అలాంటి నియోజకవర్గంలో ఇష్టానుసారం పోలింగ్ బూత్ లు మారిస్తే, ఎన్నికల వేళ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని విమర్శిం చారు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్‌రెడ్డితో కలిసి మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన అనంతరం అశోక్‌బాబు అక్కడే మీడియాతో మాట్లాడుతూ 2021 అక్టోబర్లో గురజాల శాసనసభ్యు లు కాసు మహేశ్‌రెడ్డి తన నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బూత్ లు మార్చాలని అప్పటి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారన్నారు. సదరు లేఖను కలెక్టర్ ఆర్డీవోకు పంపితే, ఆర్డీవో ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విచా రించి, స్థానికంగా అన్ని పార్టీలతో సంప్రదించాకే నిర్ణ యం తీసుకోవాలి. కానీ అవేవీ చేయకుండా ఏక పక్షంగా వ్యవహరించిన అధికారులు, పోలింగ్ బూత్ లు మార్చేశారు. గ్రామాల్లో ఏ పోలింగ్ బూత్‌లను ఎలాంటి ఇబ్బంది లేని చోట ఉంచాలి. సాధారణంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజల మధ్య పట్టింపులు, పంతాలు ఎక్కువగా ఉంటాయి. ఒక వీధిలోని వారు మరో వీధిలోకి వెళ్లే పరిస్థితే ఉండదు. అలాంటి నియోజకవర్గమైన గురజాల నియోజకవర్గం లోని గ్రామాల్లో పోలింగ్ బూత్‌లు మార్చేశారు. అధి కారులు చేసిన దానిపై స్థానిక టీడీపీ నాయకత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్యను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లామని అశోక్‌బాబు చెప్పారు.