- నవ్యాంధ్ర నాటి మహర్దశ ప్రజాకూటమి లక్ష్యం
- నేటి దుర్దశ కొనసాగింపే జగనాసుర కూటమి లక్ష్యం
- ప్రజలచేత, ప్రజల కొరకు ప్రజాకూటమి
- దోపిడీదారులు, అక్రమార్కులు, అరాచక శక్తుల రాక్షస కూటమి
- ధర్మమే గెలవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష
నవ్యాంధ్రలో ఎన్నికల కురుక్షేత్రానికి నగారా మోగింది. నిన్నటి నుండి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ప్రధానంగా రెండు కూటములు తమ తమ అభ్యర్థులను మోహరించటం ప్రారంభించాయి. ఒకటి ప్రజా కూటమి కాగా, రెండోది రాక్షస కూటమి. ప్రజల కోసం, ప్రజల తరపున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. అటువైపున.. గత ఐదేళ్లుగా నవ్యాంధ్ర ప్రజలను నానా హింసలకు గురిచేసి, అడ్డూ, అదుపు లేకుండా అందినకాడికి దోచేసి, ప్రజలను పీల్చి పిప్పి చేసిన జగనాసుర కూటమి.. అదే రాక్షస కూటమి.
రాష్ట్రంలో మే 13న జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో నాలుగు కోట్ల మందికి పైగా ఉన్న ఓటర్లే సైనికులు. నాటి మహాభారత యుద్ధంలా నేటి ధర్మయుద్ధంలో సైనికులు 18 రోజులు పోరాటం చేయరు. కేవలం ఒకే రోజే జరిగే పోరాటం మే 13న. అందుకు నిన్నటి నుండి సన్నాహకాలు మొదలయ్యాయి. కీలకమైన బ్యాలెట్ పోటీకి ఇక మిగిలింది 24 రోజులే. అభ్యర్థి పత్రాలు, వాటి పరిశీలన, ఉప సంహరణల తర్వాత 14 రోజులపాటు ప్రచార యుద్ధం జరుగుతుంది. ఈ సమయమంతా ఓటర్లు అతి మెలకువతో ఉండి ఏ కూటమి వైపు నిలబడాలో మే 13న ఎవరికి ఓటు వేయాలో అనే అంశంపై తగు నిర్ణయానికి వస్తారు. అలనాటి కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మమే గెలిచింది. నేటి నవ్యాంధ్ర ఎన్నికల భారతంలో కూడా అదే జరగాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష.
ఎందుకీ పోరాటం
నవ్యాంధ్ర ఏర్పడి 10 సంవత్సరాలవుతోంది. ఈ పయనం రెండు దశలుగా సాగింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ఐదేళ్లు ఒక మహర్దశ కాగా.. జగన్ రెడ్డి పాలనలోని ఈ ఐదేళ్లు ఒక దుర్దశ అన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల మనసుల్లో ఇప్పటికే బలంగా పాతుకుపోయింది. తిరిగి మహర్దశను కల్పించడానికి ప్రజా కూటమి నడుం బిగిస్తే గత ఐదేళ్ల దుర్దశను కొనసాగించటానికి జగనాసుర కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎటువంటి దశ కావాలో రాష్ట్ర ప్రజలు మే 13న తీర్పునిస్తారు. ఈ ఎన్నికల పోరాటం స్థూలంగా.. మంచికి చెడుకు మధ్య, ధర్మానికి అధర్మానికి నడుమ, అభివృద్ధికి విధ్వంసాలకు మధ్య, నాగరికత..అనాగరికతల నడుమ, ప్రజాస్వామ్యానికి అరాచకత్వానికి మధ్య, పేదల గౌరవం.. అవమానాల నడుమ, స్వర్ణయుగం.. రాతియుగాల మధ్య, ప్రజా సేవకులు.. ప్రజా బక్షకుల నడుమ, పేదల ఉన్నతి.. పెత్తందారీ మానసికతల మధ్య జరుగుతోంది. కనుక నవ్యాంధ్ర భవితకు ఇవి ఎంతో కీలకమైన ఎన్నికలు.
నాటి మహర్దశ
పురిటి కష్టాల్లో నుంచి పురుడు పోసుకున్న నవ్యాంధ్ర పురోగతికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్టమైన విధానాలు, ప్రభావశీల పథకాలను రూపొందించి, వాటి అమలును పరుగులెత్తించారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకం మేరకు రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగిరపరిచారు. పోలవరం నిర్మాణం రేయింబవళ్లు సాగేలా చూశారు. విభజన చట్టంలోని అన్ని అంశాలపై చకచకా పనులు జరిగాయి. యువత, మహిళలు, రైతన్నలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రత్యేక ప్రయోజనాల కోసం విశిష్ట కార్యక్రమాలు అమలయ్యాయి. లక్షలాది కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరిగింది. యువత నైపుణ్యాభివృద్ధి పథకాలు, స్వయం ఉపాధి, స్వావలంబనకు అందిన మద్దతుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించాయి. రాష్ట్ర విభజనతో భవిష్యత్తు పట్ల తీవ్ర అభద్రతకు గురైన ప్రజలకు చంద్రబాబు కృషితో గట్టి భరోసా లభించింది. రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగింది. వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం, హక్కులకు పెద్దపీట వేయటం జరిగింది. అనతి కాలంలోనే నవ్యాంధ్ర పయనం దేశ విదేశాల దృష్టిని ఆకర్షించింది. నేటి పోటీ యుగంలో నవ్యాంధ్ర శీఘ్రతర ప్రగతి ప్రయాణానికి బలమైన పునాదులు పడ్డాయి. అదొక మహర్దశ!
నేటి దుర్దశ
it is too good to last for long అని ఒక ఆంగ్ల సామెత. అంటే.. ఏదైనా ఒక మంచి ప్రయత్నంకానీ, బృహత్కార్యంకానీ ఎక్కువ కాలం నిలబడదని. నవ్యాంధ్ర విషయంలో అదే జరిగింది. 2014-19 కాలంలో చంద్రబాబు చేసిన మంచికి చెడు రోజులొచ్చాయి. గత ఎన్నికల్లో మోసపు ముద్దులు, అసత్యాలతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వెంటనే చీకటి రోజులు ప్రారంభమయ్యాయి. జగనాసుర విధ్వంసం నవ్యాంధ్రలో శివాలెత్తి చిందులేసింది. రాజధాని కనుమరుగైంది. పోలవరం నీట మునిగింది. పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడి పరారయ్యాయి. రహదారులు మృత్యుబాటలుగా మారాయి. అభివృద్ధి అడ్రసే లేకుండా పోయింది. బటన్ నొక్కుడు అనే ఏకసూత్ర విధానంతో సంక్షేమం సంక్షోభంలో పడగా రాష్ట్రం అప్పుల దిబ్బ అయింది. సగటు మనిషి జీవితం అత్యంత భారమైంది. అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. యువత నైరాస్యంలో మునిగి గంజాయి, డ్రగ్స్ కు బానిసలయ్యారు. పౌరుల స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు , వ్యక్తిగత గౌరవం అణచివేతకు గురయ్యాయి. దళితులపై నిరంతర దాడులు సాగాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. ఇసుక, మద్యం, గనులు, భూములు అన్నీ దోపిడికి గురయ్యాయి. చంద్రబాబు హయాంలో 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు స్వేచ్ఛను హరించారు. ప్రతిపక్ష నాయకునికి రక్షణ లేకుండా చేశారు. వెరసి.. నవ్యాంధ్ర బ్రాండ్ నాశనమైంది. ఇది నేటి దుర్దశ.
ప్రజా కూటమి
జగన్ దెబ్బకు విలవిలలాడిన రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు. అహంకార జగన్ రెడ్డిని ఓడిరచేందుకు ఈ ఎన్నికల్లో విస్తృత ప్రతిపక్ష కూటమి ఏర్పాటును ఆశించారు. విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండ కీలకం కనుక బీజేపీ కూడా కూటమిలో చేరాలని ఆశించారు. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తపించారు. ఈ మేరకే తెదేపా, భాజపా, జనసేన కూటమి ఏర్పడిరది. ఇది ప్రజలు కోరుకున్న కూటమి. ప్రజా కూటమి. ఈ కూటమి గెలుపే రాష్ట్ర ప్రజల గెలుపు. నవ్యాంధ్ర పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ధర్మ రక్షణ కోసం ఏర్పడ్డ కూటమి. ఈ కూటమిది పాండవపక్షం.
రాక్షస కూటమి
సింహం సింగిల్ గా వస్తుందంటూ ముఖ్యమంత్రి జగన్ అహంకారంతో విర్రవీగుతున్నారు. తానొక్కడినేనంటూ కూటమిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఆయనది బలమైన జగనాసుర కూటమి.. రాక్షస కూటమి. ఇందులో భాగస్వాములెవరంటే.. వందలాది కోట్లను అక్రమంగా సంపాదించిన వైసీపీ శాసనసభ్యులు, అభ్యర్థులు, కబ్జాదారులు, రౌడీలు, గనులు, ఇసుక, మద్యాన్ని అడ్డు పెట్టుకుని నగ్నంగా దోచుకున్నవారు, వివిధ ప్రాంతాలకు సామంత రాజులుగా వ్యవహరించిన జగన్ రెడ్డి అస్మదీయులు, దళితులు ఇతరులపై నిత్యం దాడులు చేసి, హత్యలు, అత్యాచారాలు చేసిన పెత్తందారీ ప్రతినిధులు, చట్టాలను తుంగలో తొక్కి జగన్ చెప్పింది వేదంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు. ఇంతమంది అసుర సమానులతో ఎన్నికల బరిలోకి దిగుతున్న జగన్ కూటమి రాక్షస కూటమి కాదా?
నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరం ప్రజా కూటమి, రాక్షస కూటమిల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది నవ్యాంధ్రలో జరుగుతున్న నవభారత యుద్ధం. ఈ సమరంలో ధర్మమే గెలవాలని, ప్రజలే విజయం సాధించాలని, కూటమి భారీ గెలుపుతో మే 13న జగనాసుర వధ జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిమతం.
ధర్మో రక్షతి రక్షిత: