అమరావతి: తెలుగువారి సాహసానికి ప్రతీక ప్రకాశంపంతులు అని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్య క్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమాజం కోసం తన కష్టార్జితాన్ని, జీవిత సర్వస్వాన్ని ధారపోసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు అని ఆయన జయంతి సంద ర్భంగా మంగళవారం ట్వీట్ చేశారు. ఇటువంటి త్యాగ ధనులు చరిత్రలో అరుదుగా కనిపిస్తారన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి అవసరమైన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన కృషి చేసినట్లు తెలిపారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు విశిష్ట వ్యక్తిత్వాన్ని, సాహసపోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులర్పిద్దామని పేర్కొన్నారు.
రాజీలేని పోరాటం చేసిన ‘ఆంధ్రకేసరి’
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
తుపాకులకు గుండెలు ఎదురొడ్డి హక్కులు కాపాడుకోవడం, అణిచివేతపై రాజీలేని పోరాటం ‘‘ఆంధ్రకేసరి’’ మనకందించిన స్ఫూర్తి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయన బాటలో నడిచి మన హక్కులు కాపాడుకోవడమే ఆంధ్రకేసరికి మనం అందించే నివాళి అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధునిగా ఆయనను గుర్తుచేసు కుందామన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.
టీడీపీ జాతీయ కార్యాలయంలో..
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్‌బాబు,మాజీ మంత్రి కేఎస్ జవహర్, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, హసన్ బాషా, ఎస్పీ సాహెబ్, కంభంపాటి శిరీష, సయ్యద్ రఫీ, టీఎన్టీళయూసీ నేత రఘురామరాజు, మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు పాల్గొన్నారు.