- ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి
- పుల్లారావును అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే కేసు నమోదు
- అలెక్సా కంపెనీతో సంబంధం లేకున్నా మొదటి ముద్దాయిగా పేరు
- రాజకీయ కక్షలో భాగంగానే అక్రమ అరెస్ట్ అన్న చంద్రబాబు
- శరత్‌కు ప్రాణహాని ఉందన్న లోకేష్
- కన్నీరు పెట్టుకున్న పుల్లారావు ` కొడుకు భద్రతపై ఆందోళన
- విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెదేపా శ్రేణుల ఆందోళన
అమరావతి, చైతన్యరథం: టీడీపీ సీనియర్ నేత, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్ధి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌చేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే గురువారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు…ఎక్కడ ఉంచా రు… ఎక్కడ విచారణ చేస్తున్నారనే విషయాలు కూడా కుటుంబసభ్యులకు వెల్లడిరచలేదు. మొదట శరత్ కోసం టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద ప్రత్తి పాటి పుల్లారావు ఆరా తీశారు. ఆ తర్వాత విజయవాడ సీపీ కార్యాలయా నికి వెళ్లారు.తనకొడుకు ఆచూకి చెప్పాలంటూ కన్నీళ్లపర్యంతం అయ్యారు. తన కొడుక్కు ప్రాణహని ఉందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. తన కొడు కు ఎక్కడ ఉన్నాడో జాడ చెప్పాలంటూ గద్గత స్వరంతో అడిగారు. కానీ పోలీసుల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. గురువారం ఉదయమే తన కుమారుడ్ని అరెస్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, వెంటనే శరత్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టాలని ఆయన పోలీసులను కోరారు. ఆయన వెంట టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్, పట్టాభిరావమ్, పిల్లి మాణీక్యలరావు కూడా వెళ్లారు. అయితే వీరు సీపీని కలవాలని ప్రయత్నించినా ఆయన అనుమతించలేదు.
అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే కేసు నమోదు…
చిలుకలూరిపేట అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిగా ప్రత్తిపాటి పుల్లారావును ప్రకటించిన వెంటనే ఆయన కుమారుడు, భార్య, బావమరిదితోపాటు మొత్తం ఏడుగురిపై విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దు చేశారు. అలెక్సా అనే కంపెనీకి సంబంధించి నిధులను మళ్లించి జీఎస్టీ పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలపై ఐపీసీలోని 420,409, 467,471, 477(ఏ),120 బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ చేశారు. కానీ శరత్‌కు అలెక్సా కార్పొరేషన్ లిమిటేడ్‌తో శరత్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఆయన డైరెక్టర్ కాదు కదా కనీసం షేర్ హోల్డర్ కూడా కాదని ప్రత్తిపాటి చెప్పారు. తన కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు అనగానే పుల్లారావు విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతో సీఎం జగన్ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డా రు. తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని విమ ర్శించారు. ‘‘తెదేపా తరపున నాకు చిలకలూరిపేట సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే కేసు నమోదు చేశారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాగే బురదజల్లాల ని చూశారు. ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోంది. మాకు సంబంధంలేని కంపెనీ పేరుతో దుష్ట్రచారానికి ఒడిగట్టారు. ప్రత్తి పాటి కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీయడానికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయపరంగానే ఎదుర్కొంటాం’’ అని చెప్పారు. తన బిడ్డకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతన్నారు. తన కుమారుడికి ప్రాణహాని భయం ఉందం టూ కంట నీరు పెట్టారు.‘‘శరత్ మర్డర్ చేశాడా.. అఘాయిత్యం చేశాడా.. ఏం చేశాడు-శరత్‌ను ఎక్కడ బంధించారు..ఏమి సంతకాలు తీసుకుంటు న్నారు? అలెక్సా కంపెనీలో శరత్ పాత్ర లేకున్నా.. మొదటి ముద్దాయిగా పెట్టారు. రాజకీయ కక్ష కాబట్టే.. మా అబ్బాయి ఆచూకీ చెప్పడం లేదు. సీఎం ఆఫీసు పేరు చెప్పడమే తప్ప ఆచూకీ ఇవ్వడం లేదు. ప్రతిపక్ష పార్టీ లను,నేతలను ఇబ్బందులు పెట్టడమే జగన్ లక్ష్యం. నా కుమారుడు గురిం చి చెప్పడానికి పోలీసులకు ఎందుకు భయం’’ అని ప్రతిపాటి ప్రశ్నించారు.
నేతల ఖండన…
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అక్రమ అరెస్ట్‌ను టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమ, కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండిరచారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలతోనే పుల్లారావుపై వేధింపులు అని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని అలెక్సా కంపెనీపై ఏపీడీఆర్‌ఐ కేసు పెట్టడం అధికార దుర్వినియోగం… కేసు నమోదు చేసిన మాచవరం పోలీస్ స్టేషన్‌కు జ్యురీస్‌డిక్షన్ లేదు
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి
ఎన్నికలకు ముందు చిలకలూరిపేట తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించ బడ్డ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమంగా అరెస్ట్ చేయడం ఓటమి భయంతో జగన్‌రెడ్డి చేసిన పిరికిపంద చర్యగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి పేర్కొ న్నారు. పత్తిపాటి పుల్లారావు గోదావరి జిల్లాల ఇన్‌చార్జిగా తాడేపల్లిగూడెం జెండా సభ విజయానికి తోడ్పడ్డారని, ఆ వెంటనే జగన్ కక్ష వహించి పుల్లారావు కుమారుడు శరత్‌ను ఏపీడీఆర్‌ఐ ద్వారా అధికార దుర్వి నియో గంతో గురువారం ఉదయం అక్రమంగా అరెస్ట్ చేయించారని అన్నారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టక, ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పకుండా వేధించడం దుర్మార్గమన్నారు. ఈమేరకు గురువారం ఆయన పత్రికా ప్రక టన విడుదలచేశారు. ఆ ప్రకటనలో ‘‘హైదరాబాద్‌లోవున్న అలెక్సా కార్పొ రేషన్‌లో శరత్ డ్తెరెక్టర్‌కాదు, షేర్ హోల్డరూ కాదు. హైదరాబాద్ కార్పొ రేషన్‌కు సబంధించి ఏపీడీఆర్‌ఐకిగాని, మాచవరం పోలీసులకుగానీ జ్యురీస్ డిక్షన్ లేదు. జగన్‌రెడ్డి ఆదేశాలకు మడుగులొత్తి అధికారులు చట్టవ్యతిరేక కర్యకలాపాలకు పాల్పడుతున్నారు. జగన్‌రెడ్డి వత్తిడితో చట్టవ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డ పోలీసు, రెవిన్యూ అధికా రులు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. రెండునెలల్లో అధికారం కోల్పో బోతున్న జగన్‌రెడ్డికి కొమ్ము కాసి, చట్టాలను ధిక్కరించి అధికారులు వారి భవిష్యత్‌ను చిక్కుల్లో పెట్టుకుంటారా? స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి పాల్పడుతున్న జగన్‌రెడ్డి ప్రజాకోర్టులో శిక్షకు గురికాక తప్పదు’’ అని మాల్యాద్రి హెచ్చరించారు.