అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి కుటుంబం పదికాలాల పాటు చల్లగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆహ్వాన కమిటీ సభ్యుడు హసన్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబునాయుడుకు శాలువా కప్పి సత్కరించారు. ముస్లిం మతపెద్దలు అధినేతకు ఆశీర్వచనాలు అందజేశారు.