- స్వర్ణ దేవాలయం సందర్శన మహా భాగ్యం
- విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమృత్‌సర్ (చైతన్యరథం): సిక్కులను అతి పవిత్రమైన పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంని సందర్శించి, అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం అమృత్‌సర్ చేరుకున్న మంత్రి లోకేష్ కుటుంబ సమేతంగా స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్‌సర్‌లోని పవిత్ర హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే భాగ్యం దొరకడం చాలా సంతోషంగా ఉందని అనంతరం లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందన్నారు. మంత్రి లోకేష్‌తో పాటు భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్‌లు స్వర్ణ దేవాలయంలో కొలను, లంగర్‌ను సందర్శించారు. కాగా, స్వర్ణ దేవాలయ సందర్శన సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ సిక్కు మతాచారాల ప్రచారం తలకు పవిత్రమైన వస్త్రాన్ని కట్టుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు.