- క్లస్టర్ విధానం తీసుకొచ్చేందుకు ప్రణాళిక
- కోల్డ్ స్టోరేజీలలో నిల్వ సరుకుకు రుణాలు
- ఈ-క్రాప్ 100 శాతం అమలుకు చర్యలు
- సమీక్షలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు(చైతన్యరథం): మిర్చి ధరల విషయంలో గతేడా ది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు తెలిపారు. గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్ కార్యాల యంలో మిర్చి ధరలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. గతేడాది ధరలు అధికంగా ఉండటంతో రైతులు విపరీతంగా మిర్చి సాగు చేశారని, దాని ప్రభావంతో మార్కెట్లో సమస్యలు ఏర్పడ్డాయని వివరించారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు నిల కడగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్య మంత్రి స్పష్టంగా సూచించారని మంత్రి తెలిపారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.11,750 మద్దతు ధర ఉందని చెప్పారు. ఈ ఏడాది 44 శాతం వరకు ఉత్పాదకత తగ్గిందన్నారు. క్రయ విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పాటుకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గత ఏడాది 1.96 లక్షల ఎకరాలలో పండిరచడం జరిగిందని, ఈ ఏడాది 1.06 లక్షల ఎకరాలలో పండిరచడం జరిగిందని వివరించారు. డిసెంబర్ నుండి జాన్ వరకు పంట మార్కెట్‌కు వస్తుందని తెలిపారు. 13.88 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం ఉందన్నారు. గత ఏడాది 6.62 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాద కత ఉండగా, ఈ ఏడాది 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉందని చెప్పారు. సీజన్‌లో 45 వేల నుంచి 55 వేల బస్తాలు మొత్తంగా లక్ష బస్తాలు వస్తాయని తెలిపారు. తేజ రకం మినహా మిగిలిన రకాలకు ధరలు ఆశాజనకంగా ఉంద న్నారు. మార్కెట్ ఫీజు రూ.85.37 కోట్లు వసూలైందని తెలి పారు. కొంతమంది రైతులు మిర్చి నుంచి మొక్కజొన్న సాగుకు మళ్లారని తెలిపారు. రైతులు పండిరచే పంటకు సరైన ధరలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి ధరలను బట్టి పంటలను పండిరచేలా ఒక క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలి పారు. వీటిపై రైతులకు పూర్తి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న మిర్చికి రుణాలు
ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చికి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మిర్చి మార్కెట్ యార్డు లకు వస్తోందని, స్థానిక రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా లావాదేవీలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలను పూర్తిగా రికార్డు చేస్తున్నామని, నూటికి నూరు శాతం ఈక్రాప్ నమోదు జరుగుతోందని స్పష్టం చేశారు. కంప్యూటర్ వెయిట్ మిషన్‌లు ప్రస్తుతం 100 మాత్రమే అందు బాటులో ఉన్నాయని వాటి సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. రవాణాకు ధర నిర్ణయించడం జరుగు తుందని, అంతకంటే తక్కువ ధరకు వచ్చిన వారిని అడ్డుకోవ ద్దని కోరారు. కోల్డ్ స్టోరేజ్‌లలో ఉన్న సరుకు కూడా మిర్చి యార్డుకు రావాలని స్పష్టం చేశారు.
మిర్చి యార్డ్‌లో రైతులకు సౌకర్యాలు
మిర్చి మార్కెట్ యార్డుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం బెడ్ షీట్స్ తదితర తదితర వసతులు కల్పించాలని, ఈసారి సీజన్ ముం దుగానే రావడం వల్ల రైతులకు అన్నదాన కార్యక్రమం ముం దస్తుగానే మొదలు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైతులకు మేలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం.విజయసునీత, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, డీసీసీబీ చైర్మన్ హరిబా బు, ఎగుమతిదారులు, రైతులు, కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.












