- పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న టీడీపీ అధినేత
- టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన
- పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని భరోసా
అమరావతి: పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నాయకులు నిరుత్సాహం చెం దాల్సిన అవసరం లేదని, అధికారంలోకి వచ్చిన తరువాత పొత్తులకు సహకరించిన నేతలకు ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అధి నేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేత లతో శుక్రవారం సాయంత్రం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సహకరించే నేతలకు అధికారం లోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.పొత్తులు ఉన్నందున…టికెట్ రాలే దని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచిం చారు.పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా గుర్తింపు,ప్రాధాన్యం ఉంటాయని చంద్ర బాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్తో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరతాం అంటున్నారు. కానీ, మంచివారు, పార్టీకి ఉపయోగపడతారను కునే వాళ్లనే తీసుకుంటున్నామని వెల్లడిర చారు.
టీడీపీ నేతలు అలాంటి వారి చేరిక లను ప్రోత్సహించాలని, వారితో కలిసి పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రా కదలిరా సభలు ముగిశాక మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. ఎన్నికలకు దాదాపు 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్గా పని చేయాలని స్పష్టంచేశారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో బీసీ సాధికార సభలు నిర్వహించాలన్నారు. జగన్ మోసం చేశారనే భావన ప్రతి ఒక్క బీసీ వ్యక్తిలో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన పార్టీ టీడీపీ… పార్టీలో బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది అని పేర్కొన్నారు.