అమరావతి(చైతన్యరథం): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంగళవారం ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులు సుమారు 20 నిమి షాలు భేటీ అయ్యారు. విజయవాడతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదల వల్ల సం భవించిన నష్టంపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాథమిక నివేదిక కాపీని అందజే శారు. అంతకుముందు పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులతో చంద్రబాబు జూమ్ కాన్ప Ûరెన్స్‌లో నిర్వహించి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై మార్గనిర్దేశనం చేశారు. కాగా వరదలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపినట్లు పయ్యావుల భేటీ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని, చిన్న మధ్యతరగతి ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలిపారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వృత్తి పరమైన వ్యాపారులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని బ్యాంకర్లతో భేటీ అయ్యారని, వరదల ప్రాంతాల్లో రుణాల చెల్లిం పులు, బాధితులకు చేయూత ఇచ్చేందుకు సహకారాన్ని ఇవ్వాలని కోరినట్లు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల చెల్లింపులు వాయిదా వేయాలని, వడ్డీలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సీఎం తరపున విజ్ఞప్తి చేశారు. వారిని ఆదుకోవడానికి కేం ద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదో చంద్రబాబు చెప్పిన విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తుది నివేదిక కూడా త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భం గా నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం ఒక కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటి స్తోందని, అవసరాన్ని బట్టి మరో బృందం కూడా రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. చంద్రబా బు చెప్పిన విషయాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పం దించినట్లు పయ్యావుల భేటీ అనంతరం మీడియాకు వెల్లడిరచారు.