- సీఎం ప్రచార సభలకు సిద్ధం పేరు పెట్టటంపై వ్యంగ్యాస్త్రాలు
- పారిపోదాం అని పెట్టుకుంటే బాగుండేది
- జగన్‌ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు
అమరావతి: జగన్‌రెడ్డి.. ఒక వైపు ఎన్నికలయ్యాక దేశం విడిచి పారిపోయేం దుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటూ మరో వైపు సిద్ధం పేరుతో ప్రచార సభలు నిర్వ హించటం హాస్వాస్పదమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దే వా చేశారు. సీఎం జగన్ తన ప్రచార సభ లకు సిద్ధం అని పేరుపెట్టుకోవటంపై శుక్ర వారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిద్ధం అనే పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలని హేళనచేశారు. సిద్ధమా..! దేనికి సిద్ధం జగన్‌రెడ్డి? చివరిరోజుల్లో మరింత దోచుకోవడానికా? ప్రజాగ్రహం చవిచూడటానికా? ఎన్నికల్లో ఓడిపోవడా నికా? ఓటమి అనంతరం దేశం విడిచి పారిపోవడానికా? బాబాయ్ హత్యకేసులో కారాగారవాసం చేయడానికా? కంట్లో నలుసులా మారిన చెల్లిని హింసించడాని కా? గొడ్డలిపోటు పాత్రధారి అవినాశ్‌రెడ్డిని అంతం చేయడానికా? అవినీతి కేసుల్లో జైలుకెళ్లకుండా హస్తిన పెద్దల కాళ్లపై పడ టానికా? దేనికి సిద్ధం అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
జగన్‌ను దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు
వైసీపీ సర్కారును పెకలించేందుకు ఐదుకోట్ల మంది ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నా రు. ఐదేళ్లుగా అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు మీరు ఒరగబెట్టిందేంటి? వైసీపీ దుర్మార్గాలు భరించేలేక ఆ పార్టీ నేత ల్ని ప్రజలు తన్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చిత్తు చిత్తుగా ఓడిరచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయ మన్నందుకు ఎస్మా చట్టం తెచ్చి వేధిస్తున్న లక్ష మంది అంగన్వాడీలు నిన్ను దించేం దుకు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసినందుకు కోటి మంది రైతులు నీ సీఎం కుర్చీ ఊడబీకేం దుకు సిద్ధంగా ఉన్నారు. రాజధాని అమరా వతికి స్వచ్ఛందంగా భూమిలిచ్చిన రైతుల్ని 1500రోజుల నుంచి రోడ్ల మీద పడేసిం దుకు నిన్ను దించేందుకు సిద్ధంగా ఉన్నా రు. మద్య నిషేధం హామీపై మాట తప్పి నాసిరకం మద్యంతో తాళిబొట్లు తెంచుతు న్నందుకు నిన్ను, నీ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ హామీలపై మోసం చేసినందుకు ఈ రాష్ట్రం నుంచి నిన్ను, నీ పార్టీని తరిమికొట్టేందుకు యువత సిద్దంగా ఉన్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.