అమరావతి (చైతన్యరథం): భారతీయ వ్యాపార రంగంలో విశేష ప్రభావాన్ని చూపుతున్న నాయకత్వానికి దక్కే అత్యున్నత పురస్కారం, ‘బిజినెస్ టుడే మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ (దీు వీూఔ) 2025’ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ (నఖీూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి గెలుచుకున్నారు. దీు వీూఔ 2025 అవార్డ్స్‌లో ఆమెను విజేతగా ప్రకటించడం, తెలుగు రాష్ట్రాల కార్పొరేట్ రంగానికి దక్కిన అరుదైన గుర్తింపు. దేశంలో భారీ వ్యాపార సంస్థల్ని అత్యంత సమర్థవంతంగా నడిపే మహిళలకు ఈ అవార్డు ఇస్తూంటారు. స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన బ్రాహ్మణి, హెరిటేజ్ ఫుడ్స్‌లో కేవలం వారసత్వ బాధ్యతలకు పరిమితం కాకుండా, సంస్థను ఆధునిక, లాభదాయకమైన ‘వేల్యూ-యాడెడ్ డెయిరీ పోర్ట్‌ఫోలియో’ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. సంప్రదాయ డెయిరీ వ్యాపారాన్ని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారుస్తూ, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించారు. వ్యాపారంతో పాటు సామాజిక అంశాలపై బ్రాహ్మణికి ఉన్న నిబద్ధత ఈ అవార్డుకు ప్రధాన కారణమైంది. బిజినెస్ టుడే నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా వ్యవహరించింది. దీంతో పాటు, ప్రముఖ సంస్థలు స్టాక్ ఎక్సేంజ్, ఎస్బీఐ, తదితర సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణకు తమ వంతు సహకారాన్ని అందించాయి. భారతదేశ వ్యాపార ప్రపంచంలో రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తున్న నారా బ్రాహ్మణి విజయం, తెలుగు ప్రతిభకు దక్కిన గౌరవం.















