- సర్పంచ్‌లపై లాఠీచార్జి దారుణమని ఖండన
- పెరిగిన ధరలతో ప్రజల ఇబ్బందులపై చర్చిద్దామంటే సస్పెండ్ చేశారని ఆగ్రహం
- సీఎం మాటే వేదంలా స్పీకర్ నడుచుకుంటున్నారని విమర్శ
- జగన్‌ను ప్రజలు రాష్ట్రం నుండే సస్పెండ్ చేస్తారని హెచ్చరిక
అమరావతి: ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జగన్‌రెడ్డి, పెత్తనమంతా వాలంటీర్లు, సచివాలయ సిబ్బ ందికి అప్పగించి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశాడని టీడీపీ ఎమ్మెలేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు విమర్శించారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పలేకే,పల్లెల్ని అభి వృద్ధి చేయలేకపోతున్నామన్న బాధతోనే అధికారపార్టీ సర్పంచ్‌లు కూడా ముఖ్యమంత్రికి ఎదురు తిరిగారన్నా రు.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై సభ లో చర్చ చేపడితే తన బాగోతం బయటపడుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయించాడని మండిపడ్డారు. స్పీకర్ వెన్నెముక లేకుం డా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ముఖ్య మంత్రి చెప్పిందే తనకు వేదం అన్నట్టుగా సభను నడు పుతున్నాడు.. ప్రజలకోసం గొంతెత్తిన టీడీపీ సభ్యుల్ని అన్యాయంగా సస్పెండ్‌చేసిన ఈ ప్రభుత్వాన్ని, ముఖ్య మంత్రిని ప్రజలు రాష్ట్రం నుంచే సస్పెండ్ చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. శాసనసభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం మంగళవారం గోరంట్ల, నిమ్మల మీడియాతో మాట్లాడారు.
ధరలు, పన్నుల భారంతో జనం విలవిల..
తొలుత గోరంట్ల మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీ లు, ప్రభుత్వం వేస్తున్న వివిధ రకాల పన్నులతో ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. మరోపక్క ఈ ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి, సర్పం చ్‌లు..ఎంపీటీసీలు..జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు. స్థానిక సంస్థల అభివృద్ధికి 14, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధుల్ని కూడా ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.
వేలకోట్లను రాష్ట్ర ఖజానాకు మళ్లించాడు..
కేంద్రం చేసిన చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చే నిధులు పంచాయతీలకు వెళ్లాలి. కానీ జగన్‌రెడ్డి తన మూర్ఖత్వం, మొండితనంతో కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా తుంగలో తొక్కి స్థానిక సంస్థలకు దక్కాల్సిన వేలకోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వ ఖజానాకు జమ చేయించాడు. అమృత్ పథకం, జల్ జీవన్ మిషన్‌కు కేటాయించిన నిధులు ఏమయ్యాయో కూడా తెలియ దు. కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన నిధులకు ఇవ్వా ల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులుకూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లు చివరకు తమ పంచాయతీలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన వారిలో 90శాతం వైసీపీకి చెందినవారే. అయినా కూడా జగన్ రెడ్డి వారికి నిధులు ఇవ్వకుండా వాలంటీర్లతో పెత్తనం చేయిస్తూ,పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేశాడు. ఆఖరికి బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేక సర్పంచ్‌లు ఏమిటి మాకీ ఖర్మ అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడని గోరంట్ల విమర్శించారు.
లాఠీఛార్జ్ అమానుషం, అన్యాయం..
తమకు న్యాయం చేయమని సర్పంచ్‌లు ఆందోళన కు దిగితే వారిపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి పోలీస్‌స్టేషన్లకు తరలించడం అమానుషం, అన్యాయం. ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేశించిన వాలంటీర్ వ్యవస్థను జగన్ రెడ్డి, తన పార్టీ అనుబంధ విభాగంగా మార్చాడు. వైసీపీ సభలకు జనం రాకపోతే వాలంటీర్ల తో బెదిరించి తీసుకొస్తున్నారు. వాలంటీర్లతో పాటు, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బందిని కూడా ముఖ్య మంత్రి ప్రజల్ని తరలించడానికే వినియోగిస్తున్నా డు. రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘం, మున్సిపల్ సం ఘాలు నెలల నుంచీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్య మిస్తున్నా యి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన ధరల పెరుగుదల సమస్యలపై మాట్లాడకుండా మమ్మల్ని సభ లో అడ్డుకుంటారా అని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నాళ్లు మా గొంతులు నొక్కేస్తారు?
జగన్మోహన్‌రెడ్డిపాలనలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు ఎన్నిసార్లు సభలో మాట్లాడే అవకాశమిచ్చారు. ఎంత సమయం ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడకుండా ఎన్నాళ్లు మా గొంతులు నొక్కేస్తారు? 4 సంవత్సరాల 10నెలల పాలనలో ఎన్ని నిమిషాలు టీడీపీ సభ్యులకు అవకాశమిచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. శాసనసభ స్పీకర్ వెన్నెముక లేకుండా నిబం ధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ ముఖ్యమంత్రి చెప్పిందే తనకు వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. రాజ్యా ంగం ప్రకారం ప్రతిపక్షాలకు కొన్ని హక్కులుంటాయి. వాటిని కూడా అణచివేస్తారా? అసెంబ్లీ ప్రాంగణంలో ఇన్నివేల మంది పోలీసుల్ని ఎప్పుడైనా చూశామా? ముఖ్యమంత్రి నివాసముండే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీ వరకు కనీసం 4వేల మంది పోలీసులున్నారు. ఇంత పిరికి సన్నాసి ముఖ్యమంత్రిని, ప్రజలకు భయ పడే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. ప్రజలకు అంత బ్రహ్మండంగా సేవలు అందించి, గొప్ప పాలన అందిస్తే ఇన్నివేల మంది పోలీసుల్ని జగన్‌రెడ్డి ఎందుకు కాపలా పెట్టుకుంటున్నాడు? తన సభలు, సమావేశాల కు కూడా ప్రజలు రావడంలేదని గ్రహించే జగన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని భయపెట్టి, ప్రజల్ని బలవం తంగా రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి డబ్బు లిచ్చి నా, బిర్యానీలు పెట్టి, మద్యం పంచినా ముఖ్య మంత్రి సభలకు జనం రావడంలేదు. మొన్న జరిగిన ఒక సభకు 5జిల్లాల నుంచి జనాన్ని తరలించారు.కానీ జగన్ ప్రసంగం మొదలయ్యే సమయానికి అక్కడ పట్టుమని 20వేల మంది కూడా లేరు. ప్రజల్లో జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడే అర్థమవుతోంది. జగన్‌రెడ్డి తన రాజకీయ పబ్బం కోసమే ఉత్తుత్తి కార్పొ రేషన్లు ఏర్పాటుచేసి, నిధులు..విధులు లేకుండా తనకు భజన చేసేవారిని చైర్మన్లుగా నియమించాడని గోరంట్ల విమర్శించారు.
వెంటనే విడుదల చేసి, క్షమాపణలు చెప్పాలి..
రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చి, నియంత్రత్వ పోకడలు పోతున్న ఈ ముఖ్య మంత్రికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. పవిత్రమైన చట్టసభల్ని నిర్వీర్యం చేసి, ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేశాడు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. వారికి కేటాయించాల్సిన నిధులు ఇచ్చి, గ్రా మాల అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరించాలి. ఎంపీ టీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లకు ప్రభుత్వమే తగిన రక్షణ కల్పించాలి. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సచివాల య వ్యవస్థతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎందుకూ పని కిరాని వారిగా మారిపోయారు. స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాల్లో ముఖ్యమంత్రి ఎందుకు ఎన్నికలు నిర్వహించడు? ఓటమి భయంతోనే ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రాక్షస పాలన అంతం అయితేనే స్థానిక సంస్థలకు మర లా మంచిరోజులు వస్తాయి. సహకార రంగాన్ని కూడా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రిలో నిలిచిపోతాడని గోరంట్ల దుయ్యబట్టారు.
సర్పంచ్‌ల పోరాటానికి మద్దతు..
సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రజలకోసం పోరాడుతున్న మా గొంతు నొక్కలేరని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.ప్రజల మధ్యకు వెళ్లి,ప్రజా పోరాటంతోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెబుతాం. సర్పంచ్‌ల పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుంది. అలానే ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవరకు వారికి మా మద్దతు ఉంటుందని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.