- నరేంద్రమోదీకి.. జాతి ద్రోహి బరితెగింపు లేఖ
- మహాపాపాన్ని కప్పిపుచ్చుతూ తప్పుడు వాదన
- చంద్రబాబుపై అభాండాలు మోపుతూ కల్పనలు
- జగన్ చర్యపై భగ్గుమంటున్న వెంకన్న భక్తులు
- క్షమించరాని నేరమంటున్న ప్రజాగళం
- కంటకుడిని శిక్షించాలంటూ రోడ్డెక్కుతున్న ప్రజలు
తిరుమల వెంకన్న మహా ప్రసాదానికి మహాపరాథం జరిగిందన్న బాధలో భక్తులున్నారు. మూడు రోజులుగా అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను ‘మహాపచారం’పట్ల గగ్గోలు రేకెత్తుతోంది. రివర్స్ టెండరింగ్‌తో ఇంతటి మహాపరాథానికి పాల్పడిన పాపులే.. రివర్స్ రాజకీయానికీ తెరలేపడం విస్మయం కలిగించేదే. మతపరమైన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి రాష్ట్రంలో అలజడి సృష్టించిన దుష్టులే.. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోన్న వైనం వెంకన్న భక్తుల్లో ఆగ్రహావేశాలకు తావిస్తోంది. కాసుల కోసం వడ్డికాసులవాడికే శఠగోపం పెట్టి, కల్తీ ప్రసాదాలను భక్తుల నోట కుక్కిన మహాద్రోహులు.. పచ్చి అబద్ధాలను ప్రధాని నెత్తిన విదిలించడం చూసి జనం గగుర్పాటుకు గురవుతున్నారు. పైగా వెంకన్నపట్ల విశ్వాసాన్ని ప్రదర్శించే కోట్లాది భక్తులే తనపై దాడి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్ష్యాత్తూ ప్రధానికే జాతి ద్రోహి జగన్ లేఖ రాయడం రాష్ట్రంలో చోటుచేసుకున్న విపరీత రాజకీయ పరిణామం.
‘కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిజార్చిన దుష్టుడే.. ఉత్తమోత్తముడినైన నాపై ప్రభుత్వమూకలు పలువిధాల దాడి చేస్తున్నాయన్న’ భావన కలిగేలా లేఖ రాయడం.. ‘టీటీడీ ప్రతిష్టను దిగజార్చిన సీఎం చంద్రబాబుకు బుద్ధిచెప్పాల’ని ప్రధాని మోదీని కోరడం.. జగన్ నిజస్వరూపానికి నిలువుటద్దం! మహాపాతకుడన్న అభియోగాన్ని నివృత్తి చేయకుండానే.. ‘లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. వాస్తవాలను నిగ్గు తేల్చాల’ని దోషే
ప్రధానిని కోరడం.. రాజకీయ అలజడి సృష్టించే కుట్రే!
‘నువ్వు చేసింది తప్పు కాదు, మహా పాపం, ఘోర’మంటూ సర్వమత విశ్వాసులూ వేలెత్తి చూపిస్తున్న తరుణంలోనే.. ప్రధానికి రాసిన లేఖలో పచ్చి అబద్ధాలు, వంచన వాక్యాలు పొందుపర్చాడు జగన్. దేవదేవునికి అపచారం జరిగిందన్న వేదన, బాధ కించిత్తు కూడాలేని జగన్.. తనను అప్రతిష్ట పాల్జేయడానికి దేవుడి ప్రతిష్టనే దిగజారుస్తున్నారంటూ తెంపరి వాదనకు దిగడం జగన్ దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట. ప్రపంచంముందు పాపిగా నిలబడిన జగనే.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్య తీసుకోమంటూ రాసిన లేఖలోని అజ్ఞానం.. అసలు దోషిత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లేఖలో పచ్చి అబద్ధాలను పొందుపరుస్తూనే.. ప్రభుత్వాధినేత చంద్రబాబే అబద్ధాలు చెప్తున్నారన్నది ప్రధానికి జగన్ చేసిన ఫిర్యాదు.
తాను మఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏఆర్ ఫుడ్స్‌నుంచి వచ్చిన నెయ్యిని అసలు లడ్డూ ప్రసాదానికే వాడలేదని, గత జూలై 12న ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చిన నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో తిరస్కరించామని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నాడు. ఇంతకుమించిన పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. వాస్తవానికి తితిదే మార్కెటింగ్ విభాగం నెయ్యి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. కొనుగోలుకు ముందే పలు నిబంధనలు విధించి.. అర్హులను మాత్రమే టెండర్లలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి అతి తక్కువ ధరను కోట్ చేసిన టెండరుదారుడి వివరాలను తితిదే బోర్డులోని కొనుగోలు కమిటీ ముందు పెడుతుంది. ఆ కమిటీ ఆమోదం తరువాత.. పాలక మండలిలో చర్చించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇదీ జగన్ చెప్తున్న ‘ప్రాసెస్’.
గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే తామూ అనుసరించామన్న ‘టెక్నికల్ ప్రాసెస్’ను జగన్ పదేపదే చెప్తున్నాడు. కానీ, రివర్స్ టెండరింగ్‌తో కమిషన్ల కాసులకు కక్కుర్తిపడి దేవదేవుడికి అపచారం చేసిన విషయాన్ని అంగీకరించడం లేదు. నిజానికి `ఏఆర్ ఫుడ్స్‌తో ముందే లాలూచీపడిన ఆనాటి తితిదే పెద్దలు. 2024 మార్చి 12న ఈ`టెండర్లు పిలిచారు. తూతూమంత్రంగా ‘టెక్నికల్ ప్రాసెస్’ను ముగించి.. 2024 మే 8న టెండర్లు ఖరారు చేశారు. అతి తక్కువ ధరను కోట్ చేసిన ఏఆర్ ఫుడ్స్‌తోపాటు మరో రెండు మూడు కంపెనీలను ఖరారు చేస్తూ.. పాలక మండలి అనుమతులు మమ అనిపించారు. ఆ రీతిన మే 15న పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడంతో.. జూన్ 15నుంచీ ఏఆర్ ఫుడ్స్‌నుంచి ‘కేజీ ఆవునెయ్యి రూ.319.90’కి సరఫరా మొదలైంది. ఆ నెయ్యితోనే దేవదేవుని మహా ప్రసాదం తయారవుతోంది. ఇదంతా పక్కాగా రికార్డుల్లోవున్నా..
ఆసలు ఏఆర్ ఫుడ్స్‌నుంచి వచ్చిన నెయ్యిని లడ్డూ ప్రసాదానికే వాడలేదని జగన్ బుకాయించడం, ప్రధాని లేఖలో పొందుపర్చడం మహాదారుణం. పైగా ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చిన నెయ్యిని రిజెక్ట్ చేసింది జగన్ సర్కారు కాదు, ఎన్డీయే ప్రభుత్వం. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే.. అధికారంలోకి వస్తే తన పాలన తిరుపతి ప్రక్షాళననుంచే మొదలవుతుందని చంద్రబాబు పదేపదే చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అలా ఎన్నికలలో గెలిచి మఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తిరుమల ప్రక్షాళననుంచే పాలన ప్రారంభించారు. తిరుమల ఈవోగా శ్యామలరావును నియమించిన చంద్రబాబు.. పూర్తి ప్రక్షాళనా బాధ్యతలు అప్పగించారు. అప్పటికే లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యతపట్ల లక్షలాది ఫిర్యాదులు రావడం, రెండు రోజులకే మహాప్రసాదం పాడైన వాసన వస్తుందంటే ఏదో అపరాథం జరుగుతుందంటూ భక్తులు గగ్గోలు పెట్టిన నేపథ్యంలో.. ప్రసాదాల నాణ్యతపై శ్యామలరావు దృష్టి పెట్టారు. ప్రధానంగా ఆవు నెయ్యి నాణ్యత నిగ్గుతేల్చడానికి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు పరీక్షలకు పంపిన శ్యామలరావు.. ఫలితాలు చూసి ఖంగుతిన్నారు.
జూలై 6న, 15న రెండేసి ట్యాంకులుగా వచ్చిన నెయ్యి శాంపిల్స్ తీసుకుని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపితే.. జూలై 13, 16 తేదీల్లో వచ్చిన ఫలితాల్లో జంతుకొవ్వు వ్యవహారం బయటపడిరది. వెంటనే ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చిన కంటెయినర్లను సీజ్ చేశారు. అలా ఏఆర్ ఫుడ్స్ నెయ్యిని ఎన్టీయే సర్కారు రిజెక్ట్ చేస్తే.. అదేదో తన ప్రభుత్వహయాంలో జరిగిన ఘనతగా ప్రధానికి రాసిన లేఖలో జగన్ పొందుపర్చడం విస్మయకర విషయం. ప్రొక్యూర్‌మెంట్ టెండర్ దశనుంచి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేవరకూ జగన్ ప్రభుత్వ హయాంలో మహాపాపం జరిగితే.. అది ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరిగిన అంశంగా, తనకు సంబంధం లేనట్టు ప్రచారం చేసుకోవడం జగన్ చేసిన మరో ఘోరం. ఈ చర్య ప్రధాని మోదీని మోసం చేయడం కాదు, కలియుగ దైవం వెంకన్ననే మోసం చేయడం!!
ఇక `మునుపటి చంద్రబాబు హయాంలో కర్నాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని నెయ్యినే కొనుగోలు చేయలేదన్న తప్పుడు సమాచారాన్ని ప్రధానికి లేఖలో జగన్ పొందుపర్చడం.. బరితెగింపే. ఒకపక్క కెఎంఎఫ్ చైర్మన్ భీమానాయక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌పెట్టి `2013నుంచి 2018మధ్య తితిదేకు 4వేల టన్నుల ఆవునెయ్యిని పరమ పవిత్ర కార్యంగా సరఫరా చేశామని, 2019లోనూ 2వేల టన్నుల ఆవునెయ్యిని లాభాపేక్ష లేకుండా సేవా నిరతిగా సరఫరా చేశామని చెప్తుంటే.. దీనికి భిన్నంగా ప్రధానికి లేఖలో జగన్ పచ్చి అబద్ధాలు గుదిగుచ్చాడు. వాస్తవానికి `కర్నాటకలో పాల ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరకు ఆవు నెయ్యిని సరఫరా చేయలేకపోతున్నట్టు కెఎంఎఫ్ సమాచారమివ్వడంతోనే `అప్పటి తితిదే పెద్దలు ‘రివర్స్ టెండరింగ్’కు శ్రీకారం చుట్టారు. కేవలం రూ.320కి కేజీ ఆవునెయ్యి ఎలా లభిస్తుందన్న ఆలోచన లేకుండానే.. కమీషన్లకు కక్తుర్తిపడి తమిళనాడులోని ఏఆర్ సంస్థను రంగంలోకి దింపారు. ప్రస్తావించడానికి కూడా మనసొప్పని కలుషిత కొవ్వు పదార్థాల ఆయిల్‌ను కల్తీచేసి `ఆవునెయ్యిగా సరఫరా చేస్తే.. ఇంతకాలం స్వామివారి ప్రసాదాలను వాటితోనే తయారు చేశారు. ఈ విషయాలను ప్రధానికి రాసిన లేఖలో జగన్ దాచారనడానికి.. ఎన్‌డిడిబీ రిపోర్టును జత చేయకపోవడం నిదర్శనం. తాను రాసిన లేఖను తప్ప, ప్రధాని ఇంకేమీ చూడకుండా కళ్లు మూసుకుంటారన్న భ్రమ, అహంకారం కారణం కావొచ్చు.
‘నెయ్యి కొనుగోలుకు అనుమతులిచ్చిన తితిదే పాలకమండలి సచ్చీలత మానవమాత్రులు కొలవలేనంత’ అన్నట్టుగా ప్రధానికి రాసిన లేఖలో జగన్ పొందుపర్చిన మరో విషయం అబద్ధాలకే అబద్ధం. కేబినెట్ కూర్చునకు కూడా వెచ్చించనంత సమయాన్ని, జాగ్రత్తను `పాలకమండలి కూర్పునకు వెచ్చించామని జగన్ పదేపదే చెప్తోన్న మాట ఇంకా అబద్ధం. జగన్ చెప్తోన్న అంతటి ఉదాత్తమైన పాలకమండలిని తడిమిచూస్తే.. దగాకోర్లు, చీటర్లు, కమీషన్లకు కక్కుర్తిపడేవాళ్లే కనిపిస్తారు. పవిత్రమైన తిరుపతి తిరుమలను తన సామాజిక వర్గానికి అడ్డాగా మార్చిన జగన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి గద్దెనెక్కిన 20 రోజుల్లోనే బాబాయి వైవీ సుబ్బారెడ్డికి తితిదే చైర్మన్‌గిరీ కట్టబట్టారు. నాలుగేళ్లపాటు రాజ్యమేలిన సుబ్బారెడ్డి.. తిరుమల ప్రతిష్టను ఎంత భ్రష్టుపట్టించాలో అంతా పట్టించాడు. విచ్చలవిడిగా అన్యమత ప్రచారాలు సాగినా పట్టించకోలేదు. పైగా కొడుకు కళ్లలో కసితీరే ఆనందం చూడటానికి `హిందూ వ్యతిరేక విధానాలతో క్రిస్టియానిటీని ప్రోత్సహించాడు. దేవదేవుడు కొలువు దీరిన తిరుమల కొండకే.. పార్టీ రంగులు పూసే దుస్సాహసానికీ ఒడిగట్టాడు. నాలుగేళ్ల విశృంఖలత్వం తరువాత తితిదే ఛైర్మన్‌గిరీని మరో జగన్ బంధువు కరుణాకర్‌రెడ్డి ఆక్రమించాడు.
‘టెన్ పర్సెంట్ కమీషనర్’గా పేరుబడిన కరుణాకర్‌రెడ్డి.. తితిదేను మరింత భ్రష్టుపట్టించాడు. కొండమీద జరిగే ఏ కార్యక్రమాన్నైనా ‘టెన్ పర్సెంట్ కమీషన్’కే నిర్వహించిన కరుణాకర్‌రెడ్డి.. స్వామి సంపదను కోట్లు దోచేశారన్న అభియోగాలు లేకపోలేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన విజిలెన్స్ దర్యాప్తులో.. రూ.500 కోట్ల రూపాయల దోపిడీ సాగినట్టు ప్రాథమికంగా నిర్థారించింది. వీరిద్దరూ అపర భక్తులని ప్రధానికి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించడం.. ప్రధానిని మోసం చేయడమే. ఇక జగన్ చెప్పిన ఉత్తమోత్తమ పాలకమండలిలో శరత్‌చంద్రారెడ్డి, కేతన్‌దేశాయ్ ఉదాత్త అర్హతలను ప్రస్తావించాలి. ఢల్లీి లిక్కర్ స్కాంలో కీలక నిందితుడైన శరత్‌చంద్రారెడ్డి, మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పలు కుంభకోణాలకు పాల్పడి సీబీఐ అరెస్ట్‌తో జైలుకెళ్లిన కేతన్‌దేశాయ్‌లు పాలకమండలి ప్రాశస్త్యాన్ని నిలబెట్టేవాళ్లుగా ప్రధానికి పిక్చర్ ఇవ్వడం `జగన్ తెంపరితనానికి నిదర్శనం.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిపట్ల మహాపరాధానికి పాల్పడమే కాదు, తన భ్రష్టత్వాన్ని సమర్థించుకోవడానికి ఎంతకైనా బరితెగిస్తున్న జగన్.. మనుషుల నుంచి, చట్టాలనుంచి తప్పించుకోవచ్చు. కాని `పైనుంచి తప్పొప్పుల జమాలెక్కలు చూసే భగవంతుడినుంచి తప్పించుకోవడం అసాధ్యం. వెంకన్నకు అపచారం చేసినోళ్లను వెంకన్నే కఠినంగా శిక్షిస్తాడని భక్తులు విశ్వాసం. ఆ శిక్షా సమయం ఎప్పుడు? అనే భక్తులు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు!!