- హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీసులకు హ్యాట్సాఫ్
అమరావతి,చైతన్యరథం: చీరాల హత్యాచారం ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు తక్షణమే స్పందించి నేరస్థులను అరెస్ట్ చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. గత ప్రభుత్వం కాలంలో మహిళలు న్యాయం కోసం అందరి చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని, కానీ పాలన మారిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేరాల పట్ల, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల కఠిన వైఖరితో ఉందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా చీరాల ఘటనలో పోలీసులు తక్షణమే స్పందించి నేరస్థలను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేశారని, అందుకు హోంమంత్రి అనితకు, రాష్ట్ర పోలీసులకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.