- భూఆక్రమణలపై ప్రజావినతుల్లో ఫిర్యాదులు
- గత ప్రభుత్వంలో అన్యాయాలపై వినతుల వెల్లువ
- రూ.20 లక్షల సరుకు తీసుకెళ్లి డబ్బు ఎగ్గొట్టారు
- తెనాలికి చెందిన బండారు రవికుమార్ నిర్వాకం
- అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితుడి ఆవేదన
- అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ, నేతలు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వివిధ సమస్య లపై తరలివచ్చిన అర్జీదారుల నుంచి ప్రజా వినతుల కార్యక్రమంలో మంత్రి ఫరూక్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చైర్మన్ శావల దేవదత్, వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివారెడ్డిలు అర్జీలు స్వీకరించారు. సమస్యలపై నేరుగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేశారు.
` వారసత్వంగా తాతల నుంచి వచ్చిన తమ భూమిని ముప్పాళ్ల అరుంధతి అనే మహిళ ఆక్రమించుకుని తమపైనే దౌర్జన్యం చేస్తున్నారని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన గంగసాని అప్పిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విచారించి తమ భూమిని కబ్జా నుంచి విడిపించాలని వేడుకున్నాడు.
` గుంటూరు జిల్లా పట్టాభిపురం మండలం రవీంద్రనగర్‌కు చెందిన పమిడిముక్క ల నాగభూషణం సమస్యను వివరిస్తూ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం నెమలి పురిలో ఉన్న తమ భూమిని ఆక్రమణదారులు కబ్జా చేశారని వివరించాడు. అధికారులు తమ భూమిని సర్వే చేసి కబ్జా నుంచి భూమిని విడిపించాలని వేడుకున్నారు.
` తన భర్త మరణించడంతో తాను మరొక గ్రామానికి వెళ్లగా తమ భూమిని ఎస్సీ లు కబ్జా చేశారని నంద్యాల జిల్లా గడివేముల మండలానికి చెందిన ఎస్.అబేదాజా ఫిర్యా దు చేశారు. కబ్జా నుంచి భూమిని విడిపించి న్యాయం చేయాలని కోరింది.
` బద్వేలు మున్సిపాలిటీ గుంతపల్లెలో రాఘవరెడ్డి కవిత దగ్గర తాము 2021లో ఫ్లాట్ కొనగా దానినే ఆమె 2022లో మరొకరికి అమ్మి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిందని అనంతపురం టౌన్‌కు చెందిన మాగిశెట్టి పద్మావతి ఫిర్యాదు చేసింది. దానిపై ఆమెను ప్రశ్నిస్తే తాము కట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పి డబ్బులు ఇవ్వకుండా తమను మోసం చేసిందని వివరించారు. ఆమెపై చర్యలు తీసుకుని డబుల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని వేడుకుంది.
` వైసీపీ మాజీ సర్పంచ్ గుణశేఖర్‌రెడ్డి తన స్థలాన్ని కబ్జా చేసి తనను ఇబ్బంది పెడుతున్నాడని తిరుపతి జిల్లా తిరుపతి మండలం పెరుమాళ్ల గ్రామానికి చెందిన విజ యభాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. తమ స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని కోరారు.
` తెనాలికి చెందిన బండారు రవికుమార్ అనే వ్యక్తి తనకు కోళ్ల ఫారాలు ఉన్నాయ ని చెప్పి తన వద్దకు వచ్చి రూ.20 లక్షల విలువైన 2 లారీల తెల్లజొన్నలు, 2 లారీల మొక్కజొన్నలు కొనుక్కు వెళ్లి డబ్బులు అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని నరస రావుపేటకు చెందిన ఐనంపూడి వెంకట శ్రీధర్ ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసు కుని రావాల్సిన డబ్బులు ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చాడు.
` గత టీడీపీ ప్రభుత్వంలో తనకు వస్తున్న పెన్షన్‌ను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన చెరుకూరి ఉమామహేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి తొలగించిన పింఛన్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
` ఏపీ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్, అవుట్ సోర్సిం గ్ సిబ్బందికి గత ప్రభుత్వం ఆపిన జీతంతో పాటు పెండిరగ్‌లో ఉన్న మొత్తం జీతం ఇచ్చి తమ సమస్యను పరిష్కరించాలని పలువురు సిబ్బంది వినతిపత్రం ఇచ్చారు.