- ఎంపి మాధవ్ పై తక్షణమే చర్యలు తీసుకోండి
- ఉపరాష్ట్రపతి అఖిలపక్ష మహిళానేతల విన్నపం
- ఊరికో ఉన్మాది పుస్తకం ధన్ ఖర్ కు అందజేత
న్యూడిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లుగా మహిళల భద్రత గాలిలో దీపంలా మారిందని, కామాంధుల బారినుంచి మహిళలను కాపాడాలని డిగ్నిటీఫర్ ఉమెన్ జెఎసి మహిళా నేతలు ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖర్ కు విజ్జప్తిచేశారు. గత మూడురోజులుగా డిల్లీలో మకాం చేసిన అఖిలపక్ష మహిళానేతలు బుధవారం ఉప రాష్ట్ర పతిని కలిసి మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంపై రాష్ర ప్రభుత్వ సాచివేత వైఖరి, కేసునుంచి మాధవ్‌ను తప్పిం చేందుకు పోలీసు ఉన్నతాధికారులు పడుతున్న తాపత్ర యాన్ని వివరించారు. మాధవ్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా మహిళానేతలు ఊరికో ఉన్మాది పుస్తకాన్ని రాష్ట్ర పతికి అందజేయగా..ఎపిలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అని విస్మయం వ్యక్తంచేశారు. మాధవ్ అశ్లీల వీడియోవ్యవహారంపై ఇప్పటివరకు ఎపి పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలిపారు. పార్లమెంటు సభ్యుల నైతిక ప్రవర్తనకు సం బంధించిన ఈ వ్యవహారంపై ఎలా ముందుకు ముందు సాగాలో సీరియస్‌గా ఆలోచిస్తామని, మహిళలు ఇచ్చిన ఫిర్యాదును లోక్ సభ స్పీకర్‌కు రిఫర్ చేస్తామని చెప్పారు. ఉపరాష్ట్ర పతిని కలిసిన వారిలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ జెఎసి కన్వీనర్ డాక్టర్ చెన్నుపాటి కీర్తి, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎపి కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, ఐద్వా ప్రతినిధి ఎస్ పుణ్య వతి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరు నగర జ్యోత్స్న, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి నాగ కళ్యాణి, టిడిపి గుంటూరు పార్లమెంటు తెలుగుమహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ఎపి కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ ఎస్. సవిత ఉన్నారు. ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ గత మూడు రోజులుగా అఖిలపక్ష మహిళానేతల వెంట ఉండి జాతీయ స్థాయి నేతలతో బేటీకి సమన్వయం చేశారు.