ఢిల్లీ: కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢల్లీి పర్యటనలో ఉన్న భరత్ గురువారం కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. కర్నూల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించి, అత్యుత్తమమైన కోచ్‌లను నియమించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని అయిన కర్నూలులో క్రీడల అభివృద్ధికి అన్నిరకాల అవకాశం ఉందన్నారు. కర్నూలు నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్లు వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే దేశానికి ఎన్నో పతకాలు తీసుకొస్తారన్నారు.