అమరావతి (చైతన్య రథం): ఎన్డీయే ప్రభుత్వ పాలనా విధానాలపై బురద జల్లేందుకు అనుక్షణం అవాకులూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డిపై ఐటీ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. నీతిలేని రాజకీయాలకు దిగజారిన జగన్‌రెడ్డి.. ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలు సత్యాలే అయితే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని నారా లోకేష్ సవాల్ చేశారు. ‘సైకో ఫేకూ.. నీ అబద్ధాలపై నాతో బహిరంగ చర్చకు సిద్ధమా’? అంటూ సంచలన సవాల్ విసిరారు. మంత్రి లోకేష్ సవాల్ ఆయన మాటల్లోనే..
‘ప్రతిపక్షంలోవున్నా, ప్రభుత్వంలోవున్నా మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానం గౌరవప్రదంగా ఉండాలని మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు హితబోధ చేస్తూనే వుంటారు. నిజంవైపు నిలబడాలని టీడీపీ కేడర్ నుంచి లీడర్ వరకూ దిశానిర్దేశం చేశారు. మన ప్రవర్తన భవిష్యత్ తరానికి ఆదర్శంగా ఉండాలని చెబుతారు. వైసీపీ పునాది హింస, అసత్యాలపై నిర్మించబడిరది. అబద్దాలకోరు వైఎస్ జగన్ రాజకీయ పార్టీ ముసుగులో నేర సామ్రాజ్యం నిర్మించాడు. వైసీపీ అధినాయకుడై ఉండి ఆయనే అబద్ధాలు మాట్లాడతాడు. తన పార్టీ నేతలతో అబద్ధాలు మాట్లాడిస్తాడు. ఇవే అబద్ధాలను తన మీడియా సంస్థల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాడు. ఫేక్ చేయడం, మార్ఫింగ్ చేసి తాను, తన పార్టీ, తన మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తాడు వైఎస్ జగన్. వైఎస్ జగన్ అబద్ధాల వెనుక నిజాలు ప్రజల ముందుంచుతున్నాను.
జగన్ అబద్ధం: కూటమి ప్రభుత్వం దిశ చట్టాన్ని నిలిపేసింది.
నా జవాబు: దిశా చట్టం లేనే లేదు. అదంతా పచ్చి అబద్ధం. చట్టమే లేనప్పుడు మేం ఎలా ఆపేస్తాం?
జగన్ అబద్ధం: 2019-24 మధ్య శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి
నా జవాబు: 2019-24 మధ్య జగన్ పాలనాకాలంలో 2027మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఒక్క నిందితుడిపైనా దిశ చట్టం కింద విచారణ జరగలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారు.
జగన్ అబద్ధం: ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీసులు శాంతిభద్రతలు పట్టించుకోవడంలేదు.
నా జవాబు: వైఎస్ జగన్ హయాంలో `ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలను హింసించడానికి పోలీసు వ్యవస్థని విచ్చలవిడిగా వాడారు. నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థకి అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మ్యాన్ పవర్ కోసం ఒక్క రూపాయి విదల్చలేదు వైఎస్ జగన్ ప్రభుత్వం. జనం భద్రతని గాలికొదిలేసి.. జగన్ భద్రత కోసం తాడేపల్లి ప్యాలెస్‌చుట్టూ ఐరన్ కాంపౌండ్‌ను నిర్మించడానికి ప్రభుత్వ నిధులు రూ.12.85 కోట్లు వెచ్చించారు. నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగపడే సీసీ కెమెరాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మరమ్మతులు చేయించలేదు.
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నేరాలు జరగకుండా నిఘాకు, నేరస్తులను పట్టుకునేందుకు ఎంతో అవసరమైన సీసీ కెమెరాలు 13,000 పైగా నిధులు మంజూరు చేశారు. నేరగాళ్లకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంటే, ఏపీలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలను దుర్భాషలాడేందుకు, దాడులు చేసేందుకు జగన్ తన నేరగాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే మహిళలు జగన్‌ని అధికారం నుంచి దింపారనేది నిజం. మహిళలకు రక్షణ లేకుండా చేసిన జగన్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవస్థలను గాడిలో పెట్టి, మహిళలు సురక్షితంగా భావించే వాతావరణాన్ని కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. సొంత చెల్లెళ్ళను, తల్లిని హింసించే జగన్ ఆయన పార్టీకి మహిళలు సురక్షితంగా ఉండడం ఇష్టం లేదు. ఇది వైకాపా వాళ్ల సంస్కృతి. వైఎస్ జగన్ అబద్ధం చెప్పకపోతే, పైన పేర్కొన్న అంశాలపై చర్చకు రావాలని నేను సవాలు విసురుతున్నా. చర్చకు రాలేదంటే సైకో ఫేకూ జగన్ అని తాను ఒప్పుకున్నట్టే..’! అంటూ మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు.