- జగన్ ధనదాహానికి తెగుతున్న మహిళల తాళిబొట్లు
- రాష్ట్ర ఖజనాకు మించి తాడేపల్లి ప్యాలెస్‌కు ఆదాయం
- ‘మాటా-మంతి’ ద్వారా గ్రామీణ మహిళల్లో చైతన్యం
- మాటా-మంతి పోస్టర్‌ను ఆవిష్కరించిన వంగలపూడి అనిత
అమరావతి : ‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలన్న ఆకాంక్షను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె ‘మాటా-మంతి’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా అనిత మాట్లాడుతూ ..రాష్ట్రంలో మహిళలు జగన్‌రెడ్డిని నమ్మి ఒటేసి మోసపోయారన్నారు. జగన్‌రెడ్డి వలలో పడి రాష్ట్ర మహిళలు అన్ని విధాల మోసపోయారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థిక, మానసిక హింసికు గురౌతున్నారు. జగన్‌కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోంది. ఉచ్ఛ నీచాలు మరచి ఆడబిడ్డలనే కని కరం లేకుండా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు ముందు ఎక్కువగా ఆదరించింది మహి ళలే. ప్రస్తుతం మహిళలను టార్గెట్‌చేసి హింసిస్తున్నా రు. ఎన్నికలకు ముందు నోరారా ‘అన్నా’ అని పిలిన మహిళల నోరు నేడు మూయిస్తున్నారు. తమ కన్నీళ్ల లో జగన్‌రెడ్డి కొట్టుకు పోవాలని మహిళలు శాపనా ర్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో పూటకో అత్యాచారం జరుగుతుంటే దిశ చట్టం ఏమైంది? చట్టమే లేకుండా ఆర్భాటంగా పోలీసు స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. ఈ రోజుకీ దిశా చట్టపరంగా ఒక్క కేసు కూడా నమోదు చేయ లేదు. రాష్ట్రంలో రోజురోజుకు నేరాలు పెరిగి పోతున్నాయి. మహిళా కమిషన్‌కు అత్యాచారాలు, హత్యలు జరిగిన వివరాల బుక్‌ను ఇచ్చాం. సమాచా రం ఇచ్చినా మహిళా కమిషన్‌లో చలనం లేదు. జగన్ ను,ఆయన సతీమణిని ఎవరైనఏమైనా అంటే మాత్రం డీజీపీ మహిళా కమిషన్ కార్యాలయం మెట్లెక్కి ఫిర్యా దు చేస్తారు.పదిరోజుల క్రితం విజయవాడలో ఓ మైన ర్ బాలికపై అత్యాచారం జరిగింది. తాడేపల్లికి మూడు కిలో మీటర్ల దూరంలో సంఘటన జరిగినా రక్షించు కోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రావికమతం మండలంలో ఇద్దరు పిల్లల తల్లిపై గ్యాంగ్‌రేప్ జరి గింది.మైనర్‌లు నలుగురు కలిసి అత్యాచారం చేశారు. చర్యలు మాత్రంశూన్యం.దేశంలోని నేరాల్లో 70శాతం ఘోరాలు నేరాలు మద్యం మత్తులో జరిగినవే. ఎన్ని కలకు ముందు రాష్ట్రంలో మద్యాన్ని అరికడతానని ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి మహిళల ను నమ్మించి మోసం చేశాడు. అమ్మఒడి, ఆసరా, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని మహిళలు జగన్‌కు ఓట్లు వేయలేదు. కేవలం సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తామని చెబితేనే ఓట్లేశారు.
జగన్‌రెడ్డి ధనదాహానికి బలవుతున్న ఆడబిడ్డలు
జగన్మోహన్‌రెడ్డి ధనదాహానికి ఆడబిడ్డలు బలవు తున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వెం కటరెడ్డి అనే వ్యక్తిని ఇంతవరకు పట్టుకోలేదు. కాబో యే భర్తతో వస్తున్నా రక్షణలేని పరిస్థితులు నేడున్నా యి.మద్యంమత్తులో పైశాచిక వాంఛ బయటికి వస్తోం ది. ఘోరాలు,నేరాలకు పాల్పడుతున్నారు.అనేక మంది జే బ్రాండ్స్, గంజాయి, డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. ఉమ్మడి కర్నూలుజిల్లా ఎమ్మిగినూరు నియోజకవర్గం లో ఒకవ్యక్తి తన తల్లిపైనే అఘాయిత్యం చేయబోయా డు.తాగిన మత్తులో తల్లికి, చెల్లికి, ముసలివాళ్లకి, విక లాంగురాలికి కూడా తేడా లేకుండా వీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సీఎంగా ఉన్న జగన్ ఏం చేస్తున్నారు? రేపల్లె నియోజకవర్గంలో రైల్వేస్టేషన్‌లోనే ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగితే చర్యలులేవు. అనూషను కిరాతకంగా చంపితే పోలీసులు ఆత్మహత్య గా చిత్రీరించారు. అనూష, తేజశ్వినీ, శ్రీలక్ష్మి, రమ్య, స్నేహలతలను హత్యచేస్తే ఒక్కకేసూ ఛేదించలేదు.ఎన్ని బెవరేజెస్‌లను,ఎన్ని డిస్టలరీలను మూయించారో చెప్పాలి. ఎన్ని బ్రాండ్లను తగ్గించారు? నాటుసారాను తగ్గించారా?అని మహిళలు గడపగడపకు వెళ్లే వైసీపీ నాయకులను అడిగితే ఏం సమాధానం చెబుతారు? దేశంలోని అన్ని లిక్కర్‌బ్రాండ్లని మన రాష్ట్రంలో బ్యాన్ చేశారు. లోకల్ బ్రాండైన జే బ్రాండ్‌ని తీసు కొచ్చారు. క్వాలిటీ పెంచారా?రేటు తగ్గించారా? లేదు. దరిద్రమై న క్వాలిటీ. విషపూరిత పదార్థాలు అందులో ఉన్నా యని ల్యాబ్ రిపోర్టులువచ్చాయి.గవర్నమెంటు ఏరోజు న స్పందించ లేదు. 5రూపాయలకు తయారు చేసిన విస్కీ బాటిల్‌ను 125 రూపాయలకు అమ్ముతున్నారు. కల్తీ మద్యం బారినపడి చనిపోయినవారి సంఖ్య కరో నాతో చనిపోయినవారి కంటే ఎక్కువగాఉంది.మద్యం షాపులలో ఎందుకు నగదులావాదేవీలను ప్రవేశపెట్ట డంలేదు? డిజిటల్ మార్కెటింగ్‌ను మద్యం షాపుల్లో పెట్టిస్తామని చెప్పి సంవత్సరం అయింది. ఇంతవరకు అమలు చేయలేదు. ఇళ్లలో భర్తలు తాగుడుకు బాని సైనా, నిరుద్యోగులు ఉన్నా అందుకు ఓటేసి కుర్చీపై కూర్చోబెట్టిన జగనే కారణం. మహిళ లు తమపిల్లల్ని పోషించుకోలేకున్నారు.ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
రాష్ట్ర ఖజనాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరేదే ఎక్కువ
రాష్ట్ర ఖజనాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం ఎక్కువ. గ్రామా గ్రామానికి వెళ్లి మాటా-మంతి కార్యక్రమం ద్వారా మహిళలను చైతన్యపరుస్తాం. ప్రతి మహిళకు న్యాయం జరగాలన్న నినాదంతో ముందుకుళ్తాం. జగన్ చేస్తున్న మోసాల్ని ప్రతి మహిళ గ్రహించాలి. చంద్రబాబుహయాంలో మహిళలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే విషయాలను గ్రహించాలి. జగన్ ప్రభుత్వంలో మహిళల పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారింది. మహిళలకు కావాల్సిన సంక్షేమ పథకాలను వారే కోరుకుంటూ తెలుగుదేశం మ్యానిఫెస్టోను తయారు చేసుకునే విధానం తెస్తాం. గ్రామాల్లోని ప్రతి మహిళ వద్ద నుండి సమాచారం సేకరించి మా మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని వంగల పూడి అనిత అన్నారు.