- విద్యారంగ నిపుణులకే వీసీలుగా ఛాన్స్
- నోటిఫికేషన్ జారీ చేశామన్న లోకేష్
అమరావతి (చైతన్య రథం): భ్రష్టుపట్టిన విశ్వవిద్యాలయ వ్యవస్థను సమూళంగా ప్రక్షాళించేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఏపీలో గత ఐదేళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన వర్శిటీలను సమూలంగా ప్రక్షాళన చేయడానికి కంకణం కట్టామని రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ వేదికలో స్పష్టం చేశారు. దీనిలోభాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వర్శిటీలను జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పమున్న ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 28 చివరితేదీగా ఆయన తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు.
జగన్‌కు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాజీ సీఎం జగన్ చేస్తోన్న పిచ్చి వ్యాఖ్యలపై ఐటీ మంత్రి నారా లోకేష్ తన పక్స్ (ట్విటర్) వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏం చదివావో తెలీదు. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు. నువ్వు విద్యా శాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యం పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75 వేలమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆత్మలతోకాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్‌ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయిపెట్టి పోయిన కంసమామ అయిన మీరు.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని చెప్పుకోవడం విడ్డూరం. మీరన్నట్టే అంత ఉద్దరించివుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి’ అంటూ మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.