- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి
- వ్యాపారం, రాజకీయాల సమన్వయం కష్టమౌతోంది
- కొంత కాలం తర్వాత తిరిగి బలంగా వస్తా: గల్లా జయదేవ్
గుంటూరు: రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న ఆయన… తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాము డు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయా ల్లోకి వస్తానని వెల్లడిరచారు. రాజకీయాల నుండి వైదొ గులుతున్న సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో కృతాజ్ఞతాభి వందనం సభ ఏర్పాటుచేశారు. ఆ సందర్బంగా జయ దేవ్ మాట్లాడుతూ ‘‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదు రవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నా ననే భావన ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను… కానీ,రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకు న్నా. రెండేళ్ల క్రితం మానాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండిరటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది.అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా’’అని అన్నారు. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన… స్థానిక నాయకు లు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్లు పేర్కొ న్నారు. ‘‘రాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో పోరాడా.రాజధానిగా అమరావతికే మద్ద తిస్తా. ప్రభుత్వం నుంచి బయటకి వచ్చినప్పుడు అవి శ్వాసం పెట్టారు. ఆసమయంలో పార్టీ గొంతు నేనే విని పించా. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపా రాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నాయి’’ అని జయదేవ్ తెలిపారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయి. దాంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పాం. విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నాం. రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అను కోలేదు. రాజకీయం, వ్యాపారం రెండు చేయొచ్చని భావించాను.ప్రస్తుత పరిస్థితుల్లో రెంండిరటికి న్యాయం చేయలేను. రాజకీయాలు వదిలేస్తే రావటం కష్టమే. కానీ నన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్టాను.ఎంపీలకు ప్రత్యేక అధికారాలు లేవు. రూ.5కోట్ల ఎంపీ నిధులు ఇస్తారు. ప్రాంతీయ పార్టీలలో పార్టీ లైన్ ప్రకా రం మాట్లాడాలి. రాష్ట్రహక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మా నం పెట్టిన సమయంలో మాట్లాడాను. దాంతో ఈడీ అధికారులు నన్ను పిలిచి బెదిరించారు. అయినా నేను భయపడలేదు. నేను చేసిన పనులను గుర్తించి 2019 లో ప్రజలు రెండోసారి ఎంపీగా గెలిపిం చారు. అప్పుడు కూడా ప్రతిపక్ష ఎంపీగా మాట్లాడాను. అమ రావతి రైతులతో ఛలో అసెంబ్లీ నిర్వహించాను. పోలీ సులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అమరావతి పేరును దేశ చిత్ర పటంలో పెట్టేలా చేశాను. కంపెనీ లు అన్నీ చట్ట పరంగా నిర్వహిస్తున్నాం. వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. 70 ప్రభుత్వ విభాగాల నుంచి అను మతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విభాగాలను ఆయు ధాలుగా మార్చి నాపై ప్రయోగించారు. న్యాయపరంగా ముందుకు వెళ్లాం. కోర్టులో గెలుస్తా మనే నమ్మకం ఉంది. పోరా టంలో గెలిచినా యుద్ధంలో ఓడిన పరిస్థితి ఏర్పడిరది అని’ గల్లా జయదేవ్ భావోద్వేగంతో మాట్లాడారు.
బాధగా ఉంది: రామ్మోహన్‌నాయుడు
రాజకీయాల నుంచి జయదేవ్ విరామం తీసు కోవ టం బాధగా ఉందని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. జయదేవ్ ఎంతో స్నేహపూర్వకం గా ఉంటారని, ఎన్నో అంశాలపై ఇద్దరం కలిసి పార్ల మెంట్‌లో మన వాణి వినిపించామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జయదేవ్ గొప్పగా మాట్లాడారని అన్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ జయదేవ్ వస్తారని ఆశిస్తున్నానని రామ్మోహన్ నాయుడు అన్నారు.
గల్లా తిరిగి రాజకీయాల్లోకి రావాలి: రావిపాటి సాయికృష్ణ
జయదేవ్ ఎంపీగా గుంటూరు పార్లమెంట్‌కు అద్వి తీయమైన సేవలు అందజేయటంతో పాటు రాజకీయా లలో తనలాంటి శ్రమజీవులను గుర్తించి పార్టీ అధినా యకత్వం సహకారంతో వివిధ అవకాశాలు కల్పించా రని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావి పాటి సాయికృష్ణ పేర్కొన్నారు. గల్లా లాంటి నిస్వార్ధ సేవకుడు రాజకీయ నిష్క్రమణ బాధాకరమన్నారు. చిర కాలం మా గుండెల్లో గూడు కట్టుకుంటారు అని తెలి యజేస్తూ కల్మషంలేని గుంటూరు గుండె శబ్దం గల్లాకు గుర్తుగా తెలుగుయువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అం తర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ గారిచే చిరకాలం గుర్తుండిపోయే విధంగా సైకత శిల్పా న్ని ఏర్పాటుచేసి అభిమానాన్ని చాటుకున్నానన్నారు. తిరిగి గల్లా అతిత్వరలో ప్రజాసేవలో పూర్తిస్థాయిలో సేవలందించేలా ముందుకురావాలని భగవంతుడ్ని ప్రార్ధించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు యువత నేతలు కార్యకర్తలు గల్లా అభిమానులు పాల్గున్నారు.
రాష్ట్రాభివృద్ధికి ఆయన సహకారం అవసరం: నారా లోకేష్
గుంటూరు: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన aకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేష్ మాట్లాడారు. అమరావతి రైతుల తరపున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ అని కొనియాడారు. ఆయన కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ‘‘మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదు. రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. గుంటూరు టికెట్ ఎవరైనా వదులుకుంటారా? కానీ, జయదేవ్ వదులుకున్నారు. పార్టీ మారే అలవాటు తమ వంశంలో లేదని చెప్పారు. రాజకీయాలకు తాత్కాలికంగా దూరమవుతున్నా కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా’’అని తెలిపారు.