రాష్ట్రంలో రావణాసురుడుని మించిపోయేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన చేస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. నేడు సోమవారం అభినవ రావణాసురుడు ముఖ్యమంత్రి జగన్ అంటూ కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రావణాసురుడు రూపంతో రూపొందించిన ముఖ్యమంత్రి జగన్ ఫోటోలను ముక్కల ముక్కలు చేసిన టిడిపి నేతలు, వాటిని దగ్ధం చేశారు. తల్లిని , చెల్లిని అవసరాలకు వాడుకొని రోడ్డు పాలు చేసిన దుర్మార్గుడు జగన్ అని రావి విమర్శించారు. సొంత బాబాయిని గొడ్డలి వేటుతో కడతేర్చిన జగన్కు, ప్రజలను పాలించే అర్హత లేదని, జగన్ పాలనకు చివరి రోజుల దగ్గర పడ్డాయని రావి వెంకటేశ్వరరావు అన్నారు.