రాజంపేట నియోజకవర్గం, కమ్మపాలెం, జంగాలపల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• జంగాలపల్లె ఇసుక క్వారీకి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు.
• స్థానికులు అడ్డగించినా ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది.
• మా పంచాయతీలో 20ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు టీడీపీ అధికారంలోకి వచ్చాక పట్టాలు ఇప్పించాలి.
• ఇసుక రవాణా చేసే వాహనాల వల్ల ఇటీవల 10 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కొంతమంది వికలాంగులయ్యారు.
• కమ్మపాలెం ఎస్సీ కాలనీకి పెన్నా నది నుండి నీటి సదుపాయం కల్పించాలి.
• మా గ్రామంలో పుష్కలంగా ఇసుక ఉన్నా స్థానికులను తీసుకోనివ్వడం లేదు.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక భూమి, ఇసుక సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి ధనదాహం రాష్ట్రంలోని 40లక్షల మంది భవననిర్మాణ కార్మికులకు శాపంగా మారింది.
• గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారు.
• రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రోడ్డు వేయలేదు, గుంతల్లో తట్టెడు మట్టి కూడా వేయలేదు.
• మన రాష్ట్రంలోని ఇసుక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో విరివిగా దొరుకుతోంది.
• లక్షలాది రాష్ట్రప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టి వైసీపీ నాయకులు ఇసుక వ్యాపారం చేస్తున్నారు.
• వైసిపినేతల ఇసుక కక్కుర్తివల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది చనిపోయారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతాం.
• నదీతీర ప్రాంత ప్రజలకు ఉచితంగా ఉచిత తీసుకునే అవకాశం కల్పిస్తాం.
• కమ్మపాలెం ఎస్సీ కాలనీకి ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు అందిస్తాం.
• వాస్తవ భూ అనుభవదారులను గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.