• ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం రామవరపుపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో సచివాలయం నిర్మించాలి.
• ఆసుపత్రి లేక వైద్యం కోసం కావలి వరకు వెళ్లాల్సి వస్తుంది.
• మా గ్రామంలో వైద్యశాల, సి.సి రోడ్లు, నిర్మించాలి.
• విద్యుత్ స్తంభాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి వాటిని పునరుద్ధరించాలి.
• గ్రామంలో తాగు, సాగు నీటి సమస్యలు అధికంగా ఉన్నాయి.
• పొలాలకు వెళ్లే దారి, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది.
• పంచాయితీలకు చెందిన 9వేల కోట్ల నిధులను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది.
• పంచాయితీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా లేకుండా పంచాయితీలను నిర్వీర్యం చేశాడు.
• పంచాయితీలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం.
• అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మిస్తాం.
• గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.