- ఎట్టి పరిస్థితుల్లో పనులు శరవేగంగా జరిగేలా చూడాలి
- ప్రగతి కనిపించకపోతే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు
- నిర్మాణాలపై సమీక్షలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు
- మరో మంత్రి ఆనంతో కలిసి పోర్టులో పనుల పరిశీలన
రామాయపట్నం/నెల్లూరు(చైతన్యరథం): రామాయపట్నం పోర్టును 2025 జూన్ నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పోర్టు నిర్మాణం పనులను శుక్రవారం ఆయన మరో మంత్రి ఆనం రామ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉన్నతా ధికారులతో ఉమ్మడిగా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు చేసిన పనుల వివరాలు, చేయాల్సిన పనుల వివరాలు, పెండిరగ్ పనుల వివరాలు, పలు సమస్యలను అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తున్న విషయాన్ని అధికారులకు వివరించారు. ఇప్పటివరకు జరిగిన పనులు ఒక ఎత్తయితే రానున్న కాలంలో ప్రతినెలా పనులపై తప్పనిసరిగా సమీక్ష చేస్తానని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు.
పని విధానంలో ప్రోగ్రెస్ కనిపించక పోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని గుర్తుచేశారు. భూములకు సంబంధించిన పలు సమస్యలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత ఉన్న తాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోర్టు పనులు శరవేగం గా పూర్తి కావాలని, దానికి అవసరమైన సహకారాలు ప్రభుత్వం నుంచి తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అక్కడి ప్రజ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిం చాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు 51 శాతం పనులు పూర్తయ్యాయని, రూ.1,300 కోట్లు ఖర్చు చేశారన్నారు. పోర్టు నిర్మాణం పూర్తి వ్యయం అంచనా రూ. 4,929.39 కోట్లు కాగా పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి తీసుకున్నామని వివరించారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రామా యపట్నం పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయితే ఇక్కడ ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల యువత కు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి కూడా మంచి ఆదాయం సమకూరు తుందని తెలిపారు. రామాయపట్నంపై ప్రతినెలా సమీక్షించి పనులను వేగవంతం చేస్తామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్, మారిటైం బోర్డు సీఈవో సి.వి.ప్రవీణ్ ఆదిత్య, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్, కందుకూరు సబ్‌కలెక్టర్ విద్యావతి, పోర్టు నిర్మాణం ప్రాజెక్టు డైరెక్టర్ పెరుమాళ్లు, జిల్లా స్థాయి అధికారులు, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్థానిక టీడీపీ నాయకులు అజీజ్ తదితరులు పాల్గొన్నారు.