అమరావతి(చైతన్యరథం): చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించటం లేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో జోగి రమేష్‌ను బుధవారం పోలీసులు విచారించారు. జోగి తో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఫైబర్‌నెట్ మాజీ చైర్మన్ గౌతం రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర శర్మ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. న్యాయవాది సమక్షంలోనే జోగి రమేష్ విచారణ సాగింది.
అయితే కేసు దర్యాప్తునకు జోగి రమేష్ సహకరించడం లేదని డీఎస్పీ మురళీ కృష్ణ చెప్పారు. పోలీసులకు సరైన సమాచారం ఇవ్వటం లేదన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా జోగి రమేష్ ను మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారు. ఈ కేసులో ఇటీవలే జోగి రమేష్‌ను పోలీసులు ఒకసారి విచారించారు. బుధవారం రెండోసారి విచారణకు పిలిచారు.