- మహిళల స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తాం
- ధరలు తగ్గించి మహిళలకు అండగా నిలుస్తాం
- మహాశక్తితో లోకేష్ కార్యక్రమంలో యువనేత లోకేష్
- కష్టాలు చెప్పిన మహిళలకు లోకేష్ ఆపన్నహస్తం
పాయకరావుపేట: సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాలను నేను ప్రత్యక్షంగా చూసాను. మీ కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. మీకు అండగా నిలిచేం దుకే టిడిపి – జనసేన కలిసి మహాశక్తి పథకాన్ని ప్రక టించాయని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నా రు. పాయకరావుపేట నియోజకవర్గం చినదొడ్డిగల్లులో మహాశక్తితో లోకేష్ పేరిట మహిళలతో లోకేష్ ముఖా ముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి: 18 ఏళ్లు నిండిన మహిళలకు`నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం: ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం: ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం అందించాలని నిర్ణయించాం. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామని లోకేష్ ఉద్ఘాటించారు.
మహిళలను మోసగించిన జగన్
మాయ హామీలు ఇచ్చి జగన్ మహిళల్ని మోసం చేసాడు. మద్యపాన నిషేధం అన్న జగన్ ఇప్పుడు జే బ్రాండ్ల మద్యం అమ్మి మహిళల పసుపు – కుంకుమ చెరిపేస్తున్నాడు. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అన్నాడు.. ఇచ్చాడా? 45 ఏళ్లు నిండిన బిసి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు.. ఇచ్చాడా? జగన్‌కి బల్ల పైన ఒక బటన్ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కగానే రూ.10 రూపా యిలు మీ అకౌంట్ లో పడతాయి. బల్ల కింద బటన్ నొక్కి రూ.100 మీ అకౌంట్ నుండి కొట్టేస్తున్నాడు. విద్యుత్ ఛార్జీలు 9సార్లు పెంచేశాడు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచేశాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ బాదుడే బాదుడు. అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, చంద్ర న్న బీమా ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు జగన్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు జగన్.
మహిళలకు అండగా నిలచిన టిడిపి
మహిళలు లేనిది లోకం లేదు. భూమికంటే ఎక్కువ భారం మోసేది మహిళలు.మహిళలు సంతోషంగా ఉం టే ఇల్లు, రాష్ట్రం బాగుంటుంది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. మహిళల్ని ఆర్థికం గా బలోపేతం చెయ్యడానికి డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు. దీపం పథకం ద్వారా లక్షలాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది చంద్రబాబు. పసుపు-కుంకు మ ఇచ్చింది చంద్రబాబు అని లోకేష్ వివరించారు.
తల్లి, చెల్లెళ్లే జగన్ ను నమ్మడం లేదు
జగన్ ని తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదు. తల్లికి, చెల్లి కి న్యాయం చెయ్యని వాడు రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా? నా తల్లిని, భార్యని వైసిపి వాళ్లు అవమానించారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అని బెదిరించారు. జగన్‌పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. బాధితుల తరపున పోరాడితే మా పై కేసులు పెట్టింది వైసిపి ప్రభుత్వం. టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకొచ్చి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నేను తిరుపతి కి ఫాక్స్‌కాన్ అనే మొబైల్ తయారీ కంపెనీ తీసుకొస్తే ఇప్పుడు అక్కడ 14వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. కియాలో ఎంతో మంది మహిళలు పనిచేస్తున్నారు. స్వయం ఉపాధి కోసం సాయం అందిస్తాం. స్కూల్ యూనిఫాం కుట్టే బాధ్యత మహిళలకు ఇచ్చేలా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం మని లోకేష్ హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గిస్తాం
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్,డీజిల్ ధరలు మొదలుకొని అన్ని పన్నులు తగ్గి స్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలుతీసుకుంటాం. మహిళల్ని గౌర వించడం, వారి విలువ తెలిసేలా చిన్న నాటి నుండే పాఠ్యాంశాలు ప్రవేశపెడతాం. జగన్ వి మాయ మాట లు…అసలు దిశచట్టమే లేదు. వైసిపి నాయకులే మహి ళల్ని అవమానపరుస్తూ మాట్లాడితే ఇక బయట రక్షణ ఎలా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చం ద్రన్న బీమా 5లక్షలతో ప్రారంభించి క్రమంగా రూ.10 లక్షలకు పెంచుతామని లోకేష్ భరోసా ఇచ్చారు.
అభయహస్తం నిధులు పక్కదారి
డ్వాక్రా మహిళలను ఆదుకోకపోగా మీరు దాచు కున్న అభయహస్తం నిధులు రూ. 2200 కోట్లు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. టిడిపి-జనసేన ప్రభు త్వం వచ్చిన వెంటనే ఆపేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం. జగన్ ఫీజులు చెల్లించక 2లక్షల మం దికి మార్కుల లిస్టులు రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సింగిల్ సెటిల్మెంట్ చేసి మార్కు లిస్టులు అందిస్తామని లోకేష్ చెప్పారు.
ఉద్యోగాలిస్తానని మోసగించిన జగన్
2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ మోసంచేసాడు. మెగా డీఎస్సీ అని మోసం చేసా డు. జాతీయ విద్యావిధానం పేరుతో టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. క్రమపద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతిఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జగన్ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. టిడిపి హయాంలో ఎంతో నాణ్యత తో కట్టిన ఇళ్లు కూడా లబ్ధి దారులకు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100రోజుల్లో టిడ్కో ఇళ్లు లబ్ధిదారుల కు కేటాయిస్తాం. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టి ఇస్తాం. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు పాయక రావుపేట తాగునీటి సమస్యపరిష్కారంకోసం రూ.180 కోట్లు కేటాయించి పనులు మొదలు పెట్టాం. వైసిపి ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. మన ప్రభుత్వం వచ్చి న వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగు నీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
వంగలపూడి అనిత మాట్లాడుతూ…
ఒక్క ఛాన్స్‌ఇస్తే జగన్ మహిళల్ని పాతాళంలోకి తొ క్కాడు. మహిళలపై పెను భారంవేసి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చాడు. జగన్ పాలనలో మహిళలపై అఘాయి త్యాలు పెరిగిపోయాయి. బాధిత కుటుంబాలకు టిడిపి నేతలు అండగా నిలబడితే జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది.
మహిళలు మాట్లాడుతూ…
మహిళల స్వయం ఉపాధి కోసం జగన్ ఎటువంటి సాయం అందించడం లేదు. నిత్యావసర సరుకుల ధర లు విపరీతంగా పెరిగిపోయాయి. మహిళలకు జగన్ హయాంలో భద్రత లేదు. దిశా చట్టం ఉంది అని చెబు తున్నా మాకు ఎటువంటి రక్షణ లేదు.విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు విపరీతంగా పెంచేసి బ్రతకలేని పరిస్థితి తెచ్చారు. జగన్ ప్రభుత్వం చంద్రన్న బీమా రద్దు చేసిం ది. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎటు వంటి సాయం అందడంలేదు. డ్వాక్రా వ్యవస్థను జగన్ నాశనం చేశాడు. అభయహస్తం నిధులు కూడా ప్రభు త్వం తీసుకుంది. అనేక నిబంధనలు పెట్టి ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేసాడు. ఫీజులు కట్టకపోతే మార్కుల లిస్టులు ఇవ్వమని కాలేజ్ యాజ మాన్యం అంటోంది. జాబ్ క్యాలెండర్ ఇస్తానని సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు జగన్. ఉచితంగా ఇళ్లు కట్టిస్తా నని హామీ ఇచ్చి జగన్ మమ్మలని మోసం చేసాడు. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు ఇళ్లు కేటాయించాలి. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్నా వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కష్టాల్లో ఉన్న మహిళలకు లోకేష్ ఆపన్నహస్తం
సభలో నారా లోకేష్ ఎదుట నర్సీపట్నం నియోజక వర్గం తామర గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మి తమ కష్టాలను ఏకరువు పెడుతూ కన్నీళ్ల పర్యంతమైంది. గ్రామంలో వైసిపి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ గుద్ది తన కుమారుడు 25 ఏళ్ల సాయి చనిపోయాడని ఆవేదన వ్యక్తంచేసింది. అది యాక్సిడెం ట్ కాదు… కరెంట్ షాక్‌తో చనిపోయాడు అని రిపోర్టు లు మార్చారు. కనీసం కుటుంబానికి నాయ్యం చెయ్య లేదు. రూ.25వేలు ఇస్తాం. నోరు ఎత్తకండి అని వైసిపి నేతలు బెదిరించారు. నా కుమార్తె కు పెళ్లి చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నా ను అంటూ లక్ష్మి కన్నీరుపెట్టింది. దీంతో చలించిన నారా లోకేష్… అక్కడికక్కడే లక్ష్మి కుటుంబానికి రూ.2లక్షల ఆర్ధిక సాయం ప్రకటించా రు.జగన్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసింది. టిడిపి ప్రభుత్వంలో స్కూటీ లు ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కార్పొరేషన్ నుండి ఎటువంటి సాయం అందడం లేదని దివ్యాంగురాలు వెంకటలక్ష్మి వాపో యింది. స్పందించిన లోకేష్… దివ్యాంగురాలు వెంకట లక్ష్మికి స్కూటీ అందిస్తానని హామీ ఇచ్చారు.