అమరావతి: రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన డ్రగ్స్, గంజాయి వాడకం కారణంగానే మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి జగన్‌రెడ్డి కనీస చర్యలు కూడా తీసుకోవటం లేదు సరికదా.. పెంచిపోషిస్తున్నాడని సోమవారం ఒక ప్రకటనలో అనిత హెచ్చరించారు. తాజాగా విశాఖలో 17 ఏళ్ల మైనర్ దళిత బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైంది. గతంలో రాజమండ్రిలో ఇదే రకంగా దళిత యువతి అత్యాచారానికి గురైంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి నివాసానికి సమీపంలో మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ గ్యాంగ్ రేప్‌లో ముద్దాయిగా ఉన్న వెంకట్‌రెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడిరది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం కావడం, కల్తీమద్యంతో మతి చెడి ఇలాంటి దారుణా లకు పాల్పడుతున్నారు. నేరం చేసినా ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనే భరోసాతో వైసీపీ అనుకూల రౌడీ గ్యాంగ్‌లు పెచ్చుమీరిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నా యి. రాష్ట్రంలోని మహిళల మాన ప్రాణాలకు రక్షణ కావాలంటే జగన్‌రెడ్డిని సాగనంపాలి. రాష్ట్రంలోని మహిళలంతా అపర కాళికలై జగనాసురుడి పీడ వదిలించుకోవాలని అనిత పిలుపు ఇచ్చారు.