- ఇప్పుడూ వారే వ్యాపారం చేస్తున్నారు
- నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని
- మంత్రి నాదెండ్లకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి వినతి
కడప(చైతన్యరథం): గత ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేంద్రంగా నిలిచింది.. రేషన్ కార్డుదారులకు అందాల్సిన బియ్యం పెద్దఎత్తున పక్కదారి పట్టాయని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు. పులివెందుల వైసీపీ రేషన్ స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పులివెందుల అనంతపురం జిల్లా సరిహద్దులలో ఉండడంతో అక్రమ రవాణాకు, బియ్యం నిల్వలకు వీలుగా ఉంటుందని స్మగ్లర్లు అడ్డాగా మార్చుకున్నారు.. 2019 నుంచి గత ప్రభుత్వం కాలంలో ఎవరైతే స్మగ్లింగ్ పాల్పడ్డారో ఇప్పుడు కూడా వారే వ్యాపారం చేస్తున్నారంటే ఎంత శక్తిమంతులో అర్థమ వుతుందన్నారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే స్మగ్లర్లు ప్రతినెలా కోటి రూపాయలు అర్జిస్తున్నారు.
ముఖ్యంగా సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన వైసీపీ నాయకుడు మిత్రమనాయుడు, వేంపల్లి మండలానికి చెందిన ఒక వైసీపీ మాజీ ప్రజా ప్రతినిధి, ముదిగుబ్బకు చెందిన శ్రీరామ్‌నాయక్‌లు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నా రని తెలిపారు. వీరు పులివెందులలోనే కాకుండా కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి కూడా బియ్యాన్ని సేకరించి పులివెందుల కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు. స్మగ్లర్ నాయుడు సేకరించిన రేషన్ బియ్యం నవంబర్ 5న పులివెందులలో విజిలెన్స్ అధికారులు తనిఖీలో దొరికింది. ఆ కేసు విషయమై కూడా పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. 2022 ఫిబ్రవరి 12న వేంపల్లిలో వైసీపీ నాయకుడిపై కూడా ఈ స్మగ్లింగ్‌పై 120బీ కేసు కూడా నమోదు చేయడం జరిగిందని వివరించారు. పులివెందుల నుంచి అనంతపురం జిల్లాకు ఉన్న సరిహద్దులలో నిఘా పెంచి రైస్ మిల్లులు, గోడౌన్లలో తనిఖీలు నిర్వహించి అందుకు సహకరిస్తున్న అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.