యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి ప్రదేశ్‌గా మార్చి యువతను గంజాయికి బానిసలుగా మార్చేసారని టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి యువతకు ‘‘మద్యం వద్దు ఉద్యోగాలు ముద్దు’’ అంటూ నినాదం చేస్తూ ప్రధాన సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
నేడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేట్ కంపెనీలు లేక యువత నిరుత్సాహంగా మిగిలిపోయారని రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్న మరలా ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందంటూ రావి వెంకటేశ్వరరావు తెలిపారు.