అమరావతి: పులివెందులలో కూడా జగన్మోహన్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అక్రమ కేసులతో తెలుగుదేశంపార్టీ నాయకులు బీటెక్ రవిని వేధిస్తున్నారు. పులివెందుల్లో జగన్ పునాదులు కదలటం ఖాయం. అక్రమ కేసులతో టీడీపీ నాయకులను అడ్డుకోలేరు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికపు పాలనలో ఉన్నామా?.. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పులివెందులలో జగన్మోహన్రెడ్డి అసమర్థతను బీటెక్ రవి ఎండగడుతున్నారనే ఉద్దేశంతోనే వేధిం పులకు పాల్పడుతున్నారు. డ్రాగో రాజ్యాంగం లోని అరాచకత్వం, రాజారెడ్డి రాక్షసత్వ పర్వాలు కలగ లిపి నవ్యాంధ్రను నరకానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాయి. బీటెక్ రవికి ఏమైనా జరిగితే ముఖ్య మంత్రి బాధ్యత వహించాలి.