• వినుకొండ నియోజకవర్గం రవ్వవరం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• టీడీపీ హయాంలో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు.
• సైడు కాలువలు నిర్మించే సమయంలో ప్రభుత్వం మారాక పనులు చేపట్టలేదు.
• గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు.
• పొలాలకెళ్లే రోడ్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం.
• అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనలో గ్రామీణ రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి.
• గ్రామపంచాయితీలకు చెందిన నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించడంతో అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• గ్రామాలనుంచి పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.