అమరావతి : టీడీపీ అవిర్భావం నుంచి దళితులకు ఏవిధంగా అండగా నిలిచిందో అందరూ ఒక్కసారి ఆలోచించు కోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవి చంద్ర పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గురుకు ల పాఠశాలలు, భూమి కొనుగోలు పథకం, బెస్ట్ అవల బుల్ స్కూల్స్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు లబ్ధి లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా దళితుల అభ్యు న్నతికి తోడ్పడిరదని తెలిపారు. కానీ జగన్రెడ్డి పాలన లో దళితులకు అంతా అన్యాయమే జరుగుతోందని అన్నారు. దళిత మంత్రులకు సీఎం గడప తొక్కే అవకా శం కూడాలేదని అన్నారు.జగన్రెడ్డి దళిత ద్రోహి అని, ఈ అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు టీడీపీ దళిత నేతలతో చర్చకురావాలని రవిచంద్ర సవాల్ విసిరారు.