- బస్సు యాత్ర బ్యాచ్‌కి నారా లోకేష్ సవాల్
- కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్
- 50 ఏళ్లు దాటిన గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాం
- శెట్టిబలిజలతో ముఖాముఖిలో యువనేత లోకేష్
తాళ్లరేవు (ముమ్మడివరం): వైసీపీ బస్సు యాత్ర తుస్సుమంది… బీసీల కు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్ధం… బస్సు యాత్ర చేసే బ్యాచ్ సిద్దమా అని టీడీపీ యువనేత నారా లోకేష్ సవాల్ విసిరారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో శెట్టిబలిజ సామాజికవర్గీయులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టీడీపీ – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి ఆదరణ పథకం అమలు చేస్తాం. 90 శాతం సబ్సిడీతో పనిముట్లు అందిస్తాం. ఆదరణ పథకం 2 లో మీరు కట్టిన డబ్బు ని వడ్డీతో సహా ఇస్తాం. 50 ఏళ్లు దాటిన కల్లు గీత కార్మికులకు పెన్షన్ ఇస్తాం. కల్లు గీత కార్మికులకు చంద్రన్న బీమా అమలు చేస్తాం. నీరా కేఫ్ ల ఏర్పాటు కి సహకారం తో పాటు, చెట్ల పెంపకం కోసం ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తాం. విదేశీ విద్య ప్రారంభించి బీసీ విద్యార్థులు పై చదువులకి సాయం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఉపాధి హామీతో అనుసంధానిస్తాం
బీసీలకు నిజమైన స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. శెట్టిబలిజల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుచేసి, వారి సంక్షేమం కోసం రూ.105 కోట్లు ఖర్చు చేసింది టీడీపీి. కల్లుగీత కార్మికులకు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం, మోపెడ్ లు, చెట్లు ఎక్కే యంత్రాలు కూడా అందించాం. శెట్టిబలిజలకు ఆత్మగౌరవం ఎక్కువ. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు శెట్టిబలిజలు. ఎవరి నుండి సహాయం కోసం ఎదురుచూడకుండా సొంత కాళ్ల పై నిలబడే వారు. ఉన్న దానిలో సాయం చేస్తారు. కొబ్బరి రైతులు, దింపు కార్మికులతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేసి సమస్యల పరిష్కారం కోసం భరోసా ఇస్తాను. ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి తాటి చెట్ల పెంపకం కోసం సహకారం అందిస్తామని లోకేష్ చెప్పారు.
మద్యం షాపుల్లో 20శాతం కేటాయిస్తాం!
టీడీపీి – జనసేన ప్రభుత్వ వచ్చాక శెట్టిబలిజ సోదరులను రాజకీయంగా మరింత గా ప్రోత్సహిస్తాం. సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయించి స్వయం ఉపాధి కోసం రుణాలు అందిస్తాం. మద్యం షాపుల్లో 20 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయిస్తాం. జగన్ పాలనలో చెట్ల పై నుండి పడిపోయి చనిపోయిన కల్లు గీత కార్మికుల కుటుంబాలకు టీడీపీి – జనసేన ప్రభుత్వ వచ్చిన వెంటనే సాయం అందిస్తాం.
ఎయిడెడ్ కళాశాలలను జగన్ నాశనం చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తాం. టీడీపీి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పెండిరగ్ ప్రభుత్వ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ నేరుగా కాలేజీలకు చెల్లిస్తామని లోకేష్ తెలిపారు.
జే-బ్రాండ్లతో గీత కార్మికుల పొట్టగొట్టిన జగన్
జగన్ జే బ్రాండ్స్ అమ్ముకోవడానికి కల్లుగీత కార్మి కుల పొట్ట కొట్టాడు. గీత కార్మికులపై ఎక్సైజ్ అధికా రుల దాడులు పెరిగాయి. కల్లు గీత కార్మికులు చెట్ల మీద నుండి పడి చనిపోతే కనీసం వైసీపీ ప్రభుత్వం బీమా కూడా అందించడం లేదు. కల్లుగీత పాలసీ ప్రకటించింది టీడీపీ. కల్లు గీతని ప్రోత్సహించింది టీడీపీ. టీడీపీ హయాంలో మీకు ఎటువంటి వేధింపు లు లేకుండా చేశాం.తాటిచెట్ల పెంపకం దగ్గర నుండి కల్లు అమ్మకం వరకూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రోత్సహించింది టీడీపీ అని లోకేష్ అన్నారు.
బీసీిలకు పదవులు దూరం చేసిన జగన్
బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేష్లను ఇచ్చింది టీడీపీ. జగన్ బీసీల వెన్ను విరిచాడు. నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసాడు. బీసీ మంత్రి పేషీ లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ పాలనలో ఉంది. జగన్ బీసీ లకి 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16 వేల మంది బీసీలను పదవులకి దూరం చేసాడు. 26 వేల మంది బీసీ ల పై అక్రమ కేసులు పెట్టారు. బాపట్ల జిల్లాలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ని కిరాతకంగా చంపేశారు. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
అడ్డగోలు హామీలు ఇవ్వను
జగన్ అప్పు చేసి బటన్ నొక్కుతున్నాడు. రూ. 12 లక్షల కోట్లు అప్పు చేసాడు. ఇప్పుడు బటన్ నొక్కినా డబ్బులు పడని పరిస్థితి వచ్చింది. జగన్ దిగిపోయే సమయానికి ప్రతి ఏడాది చెల్లించాల్సిన వడ్డీ నే లక్ష కోట్లు అవుతుంది. అమ్మ ఒడి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు బీసీ ల సంక్షేమం ఖాతా లో రాస్తున్నాడు. మద్యపాన నిషేదం హామీ ఇచ్చి మాట తప్పింది జగన్. జగన్ లా పరదాలు కట్టుకొని తిరగాలి అని నాకు లేదు. అమలు చెయ్యలేని అడ్డగోలు హామీలు నేను ఇవ్వనని లోకేష్ స్పష్టం చేశారు.
శెట్టిబలిజ ప్రతినిధులు మాట్లాడుతూ…
కొబ్బరి వలుపు కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు సహాయం అందించాలి. టీడీపీి హయాంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందాయి. వైసీపీ పరిపాలన వచ్చిన తరువాత మాకు ఎటువంటి సాయం అందడం లేదు. శెట్టిబలజ విద్యార్థులు పై చదువులు చదవడం కోసం ఉపయోగపడిన విదేశీ విద్య పథకాన్ని జగన్ రద్దు చేశాడు. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభించాలి. జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైసీపీ వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మాకు ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. చెట్ల మీద నుండి పడిపోయి చనిపోయిన వారికి రూపాయి సాయం జగన్ ప్రభుత్వం అందించలేదు. కల్లు గీత కార్మికులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది. పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకి పంపుతున్నారు.