- ఒక్క మెగా లేఅవుట్‌లోనే రూ.175 కోట్ల కుంభకోణం
- మున్సిపాలిటీలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం
- పట్టణ సుందరీకరణ పేరుతో అవినీతి చేయలేదా?
- ఇరిగేషన్, ఎత్తిపోతల పథకాలలో నిధులు మెక్కలేదా?
- పంటల బీమా కూడా చెల్లించకుండా రైతులను మోసగించలేదా?
- మోసాలు వెలికితీస్తాం..బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రంలో రైతులను, పేదలను పట్టించుకునే వాళ్లే లేరు అంటూ… రాష్ట్రం మొత్తం అచేతన వ్యవస్థలోకి వెళ్లిపోయిందని.. తానే ప్రజారక్షకుడినని, మంచి పరిపాలన అందించానని బీరాలు పలుకుతున్న జగన్‌రెడ్డి… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలో జరిగిన అన్యాయాలకు, అక్రమాలపై విచారణకు సిద్ధమా? అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీలి మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు రైతులకు కూటమి వల్ల మేలు జరగలేదని జగన్‌రెడ్డి దుష్పప్రచారానికి తెరలేపాడని విమర్శించారు.
రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెబుతున్న జగన్‌రెడ్డి పులివెందులలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై పులివెందుల, తాడేపల్లిలో ఎక్కడైనా చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరా రు. పులివెందుల మున్సిపాలిటీలోని జగనన్న మెగా లేఅవుట్‌లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే… ఇటీవల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్ధిదారులు బోగస్, అనర్హులని తేల్చిందన్నారు. అంటే ఒక్క పులివెందుల మున్సిపా లిటీలో రూ.175 కోట్ల స్కాం గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే… ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు.
బినామీ పేర్లతో అనర్హులకు సెంటు స్థలాలు
పులివెందుల మున్సిపాలిటీలో 8,468 ఇళ్లు మంజూరైతే వీరందరికీ ఏపీఐజీసీకి చెందిన 250 ఎకరాల స్థలం తీసుకుని ఒక్కొక్క లబ్ధిదారుడికి ఒకటిన్నర సెంటు స్థలంలో రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లను నియమించి గృహ నిర్మాణం చేయాలని నిర్ణయిం చిందన్నారు. దీనిలో జగనన్న మెగా లేవుట్లో 7075 ఇళ్లు మంజూరు చేస్తే దానిలో 1675 మంది అనర్హులని తేలిందని తెలిపారు. అంటే దాదాపు 23.67 శాతం మంది బోగస్ లబ్ధిదారులు.. వైకాపా సంబంధించిన బీనామీలు దొంగపేర్లు పెట్టుకుని కోట్లాది రూపాయ లు కాజేసినది నిజం కాదా జగన్ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాకుండా సొంత స్ధలాలు ఉన్నాయని గృహాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న 1918 మందిలో… పెద్ద పెద్ద భవంతులు, ఇళ్లు ఉన్న వారు, కోటీశ్వరులు దాదాపు 732 మంది దొంగ లబ్ధిదారులు అని తేలిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దాదాపు 55.5 శాతం మంది తమకు ఇళ్లు ఉన్నా ..సొంత స్థలాలు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నా దొంగ పేర్లు పెట్టుకుని ప్రభుత్వం డబ్బు కాజేయాలని మీ కార్యకర్తలు ఇళ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
పులివెందుల మున్సిపాలిటీ అంతా దోపిడీమయం
రాజీవ్ గాంధీ కాలనీలో 75 ఇళ్లను మంజూరు చేశారు. దానిలో 17 మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవం కాదా? అక్కడ 22.6 శాతం బోగస్ లబ్ధిదారులుగా తేలింది. గతంతలో ఇళ్లు మంజూరై ఇళ్లు కట్టుకున్నా మరోసారి ఇళ్లను మంజూరు చేసిన వారిలో దాదాపు 65 మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దాదాపు 8,468 ఇళ్లలో 2489 మంది బోగస్ లబ్ధిదారులుగా తేలిన విష యం తెలియదా అని ప్రశ్నించారు. పులివెందులలో పాణా ముసుగులో వందల కోట్ల స్కాం జరిగింది.. దానికి మీరు విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. పులివెందుల సుందరీకరణ అని చెప్పి రూ.650 కోట్లు వెచ్చించిన దానిలో ఇస్టానుసారంగా అవినీతి జరిగిందనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్, ఎత్తిపోతల పథకాలలో కూడా వందల కోట్లు స్కాం జరిగిందనేది వాస్తవం కాదా?
పులివెందుల మున్సిపాలిటీకి దాదాపు రూ.23 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాలి… కాబట్టే అక్కడ ఇప్పడు కనీసం వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి దాపురిం చిందంటే అది మీ నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. మీ నియోజక వర్గానికే మీరు ఏమి చేయలేకపోయారు. మీరు ముఖ్యమంత్రిగా దిగేపోయే సమయానికి ఒక్క పులివెందుల నియోజకవర్గానికి రూ.800 కోట్లు వివిధ రకాల పనులు చేసిన వాళ్లకు చెల్లించాల్సి ఉంది. నీకు కావలసిన పెద్దారెడ్డికి వందల కోట్లు బిల్లులు చెల్లించి..ఏం పాపం చేశారని నీ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు అన్యాయం చేశావ్ అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త లు ఇప్పటికైనా మేల్కోవాలని, మీ మీద ప్రేమ లేని వ్యక్తికి మీరు ఎందుకు అండగా నిలబడాలనుకుంటున్నారో ఆలోచించుకోవాలని తెలిపారు.
పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా నీతులా?
2023-24కు పంటలకు సంబంధించిన ప్రీమియం ఎందుకు చెల్లించలేదు? ఈ రోజు సాక్షి పత్రికలో ఎన్నికల కోడ్ వచ్చినందు వల్ల కట్టలేదు అని రాశారు. 2023 జూలై 31 న ప్రీమియం గడువు ముగిసింది. దీని సంబందించిన ఈ క్రాప్ బుకింగ్ కూడా ముగిసింది. మీరు అప్పడు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా.. ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా చెల్లించలేదని మాట్లాడుతున్నావు.. కొంచెమైనా నీకు సిగ్గూ శరం ఉందా? అని ప్రశ్నించారు. 2019 వరకు ప్రధాన మంత్రి పసల్ యోజన బీమా పథకం కింద ఈ రాష్ట్రప్రభుత్వం సొమ్మును చెల్లించేది.. చంద్రబాబు హయాంలో పులివెందుల కోసం ఎన్నో రకాలుగా కార్యకమ్రాలు చేపట్టారని వివరించారు.
మోసాలు వెలికితీస్తాం..చర్యలు తీసుకుంటాం
మీ పాలనలో అభివృద్ధి ముసుగులో జరిగిన మోసాలు వెలికితీస్తాం .. బాధ్యులపైనా చర్య లు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుందంటూ… పంటల బీమా ఇంకా చెల్లించలేదంటూ అంటున్న జగన్‌రెడ్డి రైతులకు ఎవరి ప్రభుత్వంలో మేలు జరిగింది? ఎవరి ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు? నీ గుండెల మీద చెయ్యి వేసి ఆలోచన చేయాలని హితవుపలికారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడితే.. కడప జిల్లాలోని కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి మీ దగ్గరకు దస్త్రాలను పంపితే మీరు వాటిని విసిరి పారేయలేదా అని ప్రశ్నించారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని కరువు ప్రకటిస్తే అది అవమానం అని వాటిపై సంతకాలు చేయకుండా రైతాంగానికి మోసం చేసిన వాస్తవం కాదా? ఇంత దారుణాతి దారుణంగా మీరు మోసం చేసి మళ్లీ రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 2014-2019 మధ్య రైతులకు ఏమీ జరిగింది? 2019-24 మధ్య రైతులకు ఏమీ జరిగింది? నువ్వు, నీ పార్టీ ప్రతినిధులైనా తెలుసుకుంటే మంచిదని… దీనిపై ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.