- ప్రధాని మోదీ, చంద్రబాబుల ఆలోచనల సారూప్యత
- పొత్తుతో రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు
- రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయకత్వ ఆవశ్యకత
- జగన్ రెడ్డి విధ్వంసక పాలన పట్ల ఆందోళన
- వికసిత భారతానికి నవ్యాంధ్ర ప్రగతి అనివార్యత
- కలసి పనిచేసిన నేపథ్యం
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో నవ్యాంధ్ర ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తోంది. ఇది ఎంతో విలువైన సమయం. నిర్దిష్ట అభివృద్ధి వ్యూహాలు, ప్రణాళికలతో పాలన సాగివుంటే ఈపాటికే ప్రగతి సంకేతాలు స్పష్టంగా కనిపించివుండేవి… సగటు మానవుని జీవితం ఎంతో మెరుగై ఉండేది. కానీ.. నేటి నవ్యాంధ్రలో దీనికి పూర్తి భిన్నమైన స్థితి నెలకొంది. ఎగుడు దిగుడులతో సాగిన ఈ దశాబ్ద కాల పయనాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని.. దానికోసం బీజేపీతో పొత్తు ప్రయోజనకరమని స్పష్టమౌతుంది.
తొలి ఐదేళ్లు
2014లో ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి గా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. పలు పరిమితులు, కష్టాల నేపథ్యంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని ఆయనే సరైన మార్గంలో నడిపించగలరన్న నమ్మకంతో ప్రజలు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతునిచ్చారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమున్న చంద్రబాబు నవ్యాంధ్ర ప్రగతి కోసం సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల అనంతరం పటిష్టమైన ప్రణాళికలను రూపొందించా రు. వాటి అమలు కోసం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏదేశమైనా, రాష్ట్రమైనా త్వరగా అభివృద్ధి చెందాలంటే గ్రోత్ ఇంజన్ లా పనిచేసే రాజ ధాని నగరం అత్యవసరమనేది జగద్విదితం. ఈ మేర కు అన్నికోణాల నుంచి పరిశీలించి నవ్యాంధ్ర రాజధా నిగా అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొం దించి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అతి తక్కువ కాలం లోనే పనులు చేపట్టి ఫలితాలను చంద్రబాబు ప్రజలకు చూపి కొత్త రాజధాని పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించారు.
రాజధాని నిర్మాణంతోపాటు భారీ ఎత్తున సాగునీటి పథకాలు, విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, రైతులు, యువత, మహిళలు, పేదల సంక్షేమం కోసం పలు వినూత్న పథకాలుచేపట్టి అభివృద్ధి,సంక్షేమాలను సైకిల్ కు రెండు కాళ్లలాగ పరిగణిస్తూ నవ్యాంధ్రను సమగ్రాభి వృద్ధి దిశలో నడిపించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.
కొత్తరాష్ట్రంలో అమలైన నూతన రాజధాని ప్రాజెక్టు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశ, అంతర్జా తీయ దృష్టిని ఆకర్షించాయి. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో భారీ ఎత్తున దేశవిదేశాల నుంచి పెట్టు బడులు వచ్చాయి. పర్యవసానంగా.. చంద్రబాబు హయాంలో నవ్యాంధ్రకు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది.
కేంద్రం మద్దతు
2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో అధికారం పంచుకోవ టంతోపాటు కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనసేన ఈకూటమికి మద్దతిచ్చింది. బీజేపీతో పొత్తు నవ్యాంధ్ర ప్రగతికి చంద్రబాబు విధానాల అమ లులో బాగా తోడ్పడిరది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లో రాష్ట్రానికి ఇచ్చిన పలు హామీల అమలులో కేంద్రం అండగా ఉండటంతో మంచి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో తెదేపా కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలగింది.
నేటి దీనాంధ్ర
ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల వద్ద ప్రాధేయపడి 2019లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక.. గత ఐదేళ్లుగా ఆయన చేసిన నిర్వాకాలతో చంద్రబాబు రూపకల్పన చేసిన నవ్యాంధ్ర నేడు దయనీయ స్థితిలో కూరుకుపోయింది. అప్పులు, అరాచకాలు, అవినీతి, అప్రజాస్వామిక ధోరణి, అనుభవ రాహిత్యం, అసమర్థ పాలన, అస్మదీయులకు పెద్దపీట వేయటం వంటి ధోర ణులతో జగన్‌రెడ్డి నవ్యాంధ్రను విధ్వంసం చేశాడని రాష్ట్ర ప్రజలు, పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు విధానాలను కొనసాగించివుంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన నవ్యాంధ్ర జగన్‌రెడ్డి దెబ్బతో ఓ పాతికేళ్లు వెనక్కి పోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్త మౌతోంది. రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్‌రెడ్డి మాట తప్పి,మడమతిప్పి మూడు రాజధానుల పేరిట ఐదేళ్లుగా నాటకాలాడి చివరకు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. ప్రజల్లో నైరాశ్యాన్ని నింపాడు. మౌలిక వసతుల రంగం కుదేలైంది. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కొత్త పెట్టుబడులు రాకపో గా.. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదలి పారిపోయాయి. సంక్షేమం సంక్షోభంలో పడిరది. ప్రజాస్వామ్యం గాడి తప్పింది. వ్యక్తి స్వేచ్ఛ హరించబడిరది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు జైళ్లపాలు అవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు జగన్‌రెడ్డి బాధితులయ్యారు. యువత నిర్వీర్య మైంది. వెరసి.. భవిష్యత్తు పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది.
పొత్తే పరిష్కార మార్గం
ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేనలు ఎన్నికల పొత్తు పెట్టుకున్నాయి. ఇది అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్న రాష్ట్ట్రానికి, నానా ఇబ్బం దులు పడుతున్న ప్రజలకు భారీ ఊరట కల్పించే పరిణామం.
జగన్‌రెడ్డి పాలనలో అధోగతి పాలైన నవ్యాంధ్ర పునర్నిర్మాణం రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తప్పక ఏర్పడనున్న నూతన ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. రాష్ట్రాల అభివృద్ధితో కూడిన దేశ ప్రగతిలో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పాత్ర వహిస్తుంది. పలు నూతన పథకాల రూపకల్పన, వాటి అమలుకు రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపు, వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులను ప్రోత్సహించటంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. కనుక కేంద్ర సాయం అవసరం.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఈ ఎన్నికల్లో దాదాపు 400 లోక్‌సభ సీట్లు గెలవాలనే పట్టుదలతో బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఈదిశగా గతంలో ఎన్డీయేను వీడిన పార్టీల ను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించడంతో పాటు, బిజూ జనతాదళ్ వంటి పార్టీలతో పొత్తు కోసం బీజేపీ చర్యలు చేపట్టింది. తెదేపాకు బీజేపీ ఆహ్వానం పలికింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర సాయం అవసరాన్ని గుర్తించి బీజేపీతో పొత్తును ఆకాంక్షించారు. ఈ విధంగా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, తెదేపాలు మరోసారి చేయి కలిపాయి.
2018లో తెదేపా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని వీడినా.. నేడు మరలా కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించటం.. నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి చంద్ర బాబు నాయకత్వం అవసరాన్ని బీజేపీ స్పష్టంగా గుర్తించిందనటానికి సంకేతం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తికానున్న 2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటానికి ప్రధానమంత్రి మోదీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు కూడా అదే విజన్ తో దేశం ముందుకు సాగాలని పలుమార్లు బహిరం గంగా పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థమైన అమలు పట్ల అనుభవం, నిబద్ధత కలిగిన ఈ ఇద్దరు అగ్ర నాయకుల ఆలోచనల్లోని సారూప్యత దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుంది. రానున్న ఐదేళ్లలో ఈ ఇద్దరు నాయకుల సమష్టి కృషి ఆంధ్రప్రదేశ్‌కు పలురకాలుగా మేలు చేసి.. నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి ఎంతో దోహదపడుతుందని పరిశీల కుల ఏకాభిప్రాయం.
పొత్తుతో స్వేచ్ఛాయుత ఎన్నికలు
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పెత్తందారీ మానసికత, నియంతృత్వపు పోకడలతో రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తి కనుమరుగై వ్యక్తి స్వేచ్ఛకు, హక్కులకు తీవ్ర భంగం వాటిల్లింది. అన్నివర్గాల ప్రజలు నిత్యం భయంతో బతు కుతున్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ, శాసన సభ స్థానాల ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలు రాష్ట్రం లో గతంలో ఏనాడు జరగలేదు. ప్రతిపక్షాల అభ్యర్థు లను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, ఓటర్ లిస్ట్లుల అక్రమాలు, హింసాత్మక చర్యలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయటం రాష్ట్ర ప్రజలు పలు మార్లు ప్రత్యక్షంగా చూసి, అనుభవించి ఉన్నారు.
తన నిర్వాకాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న వాస్తవాన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్ని అక్రమ మార్గాల ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని పలు కుట్రలకు ప్రణాళికలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలు ఇందుకు తార్కాణం. ప్రతిపక్షాల ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఏ విధంగానైనా అడ్డుకోవటం మరో వ్యూహం. ఇందుకోసం పాలన, పోలీస్, ఎన్నికల నిర్వహణా వ్యవస్థలను దుర్వినియోగం చేయటానికి ముఖ్యమంత్రి నడుం కట్టారు.
వాస్తవం కాకపోయినప్పటికీ.. గత ఐదేళ్లుగా తానం దించిన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం తనకు అండగా ఉంటుందనే సందేశాన్ని పంపిరానున్న ఎన్నికల్లో వివిధ వ్యవస్థలను దుర్వినియోగం చేయటానికి ముఖ్యమంత్రి భారీ పన్నాగం పన్నారనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా నెలకొంది. తెదేపా, జనసేన, బీజేపీ పొత్తుతో ఈ కుట్ర ఒక్క దెబ్బతో భగ్నమైందని రాజకీయ పరిశీల కులు అంటున్నారు. దీంతో.. ఎట్టి భయం లేకుండా ప్రజాస్వామ్య ప్రేమికులైన ప్రజలు తమ పవిత్రమైన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియో గించటం జరుగుతుందని,ఈ పరిణామం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అక్రమ ఆలోచనలకు తీవ్ర విఘాతమని పరిశీలకులు ముక్త కంఠంతో అంటున్నారు. ఇది రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని వారి అభిప్రాయం.