అమరావతి (చైతన్యరథం): వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అధోగ తి పాలయిన రాష్ట్ర పునర్నిర్మాణం టీడీపీ -జనసేన-బీజేపీ కూటమితోనే సాధ్య మని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలన లో అన్ని వ్యవస్థలూ విధ్వంసానికి గుర య్యాయి.. జగన్ పాలనలో బాధితులు కాని వర్గం అంటూ లేరు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేసిన ఈ దుర్మార్గ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు మూడు పార్టీలు జతకట్ట డం శుభ పరిణామమని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అన్ని వర్గా ల ప్రజలు ఈ కూటమికి మద్దతు తెలి యజేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో విన్నింగ్ టీమ్‌గా నిలిచిపోతుంది. రాష్ట్రా న్ని పునర్నిర్మించడమనే ఏకైక అజెండా తో మూడు పార్టీలు మహా కూటమిగా ఏర్పడ్డాయి.
జగన్ చేసిన విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడా నికి కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు చాలా అవసరం. కేంద్ర ప్రాయోజిత పథకాలు, అమరావతి నిర్మాణం, పోలవరం, నదు ల అనుసంధానం, విభజన చట్టం హామీలు సత్వర అమలుకు కేంద్ర సహ కారం అవసరం. తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటేనే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది. ఇప్పుడు బీజేపీ చేరడంతో ఈ మహా కూటమిని చూసి దుకాణం సర్దుకొని పారిపోవడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల కోసం,ప్రజల తరుపున ఏర్పడిన తెలుగు దేశం- జనసేన – బీజేపీ రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తూ బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.