ఆముదాల వలస, చైతన్యరథం: ఆముదాల వలసలో ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం అక్రమాలపై స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఆముదాల వలసలో నిర్వహించిన శంఖారావం సభలో స్థానిక టీడీపీ ఇంఛార్జ్ కూన రవికుమార్ తమ్మినేని సీతారాం అవినీతి చిట్టానంతా చదవి వినిపించారు. వెనువెంటనే సభకు హాజరైన ప్రజలు తమ్మినేని సీతారాం అక్రమాలన్నింటినీ రెడ్‌బుక్‌లో ఎక్కించాలని, అతన్ని వదలకూడదని గట్టిగా డిమాండ్ చేశారు.
అప్పుడు లోకేష్ స్పందిస్తూ తమ్మినేని సీతారామ్ అక్రమాలన్నీ రాస్తే రెడ్‌బుక్ కూడా సరిపోదని అన్నారు. టీడీపీ`జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్మినేని అవినీతిని బయటకు లాగడం, అతనికి తగిన శాస్తి చేయడం ఖాయమన్నారు. ఈలోపు స్టేజీ మీదున్న టీడీపీ`జనసేన నేతలు అవసరమైతే రెడ్ బుక్`2 ఓపెన్ చేయండని, తమ్మినేని అక్రమాలైతే అన్నీ లిఖించాల్సిందేనని లోకేష్‌ను కోరారు.