- రైతులకు మేలు జరిగేలా నిబంధనలు తొలగింపు
- రవాణా, గోనె సంచులు, కూలీల కొరతకు చర్యలు
- తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు
- పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి(చైతన్యరథం): కళ్లాల వద్ద రైతు నుంచి ధాన్యం కొనుగోలుకు లారీ, గోతాలు, హమాలీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరా ల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరి నియో జకవర్గం కొల్లూరు, ఈపూరు, కాప్రా, జంపని గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించా రు. రోడ్డు వెంబడి ధాన్యం ఆరబోసిన రైతులతో మంత్రి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వల్లభాపురంలో రైతులు కరకట్ట వద్దకు మాత్రమే ఆర్టీసీ బస్సు వస్తుం డటంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వల్లభాపురం పేరం టాలమ్మ గుడి వరకు ఆర్టీసీ బస్సు నడపాలని ఆదేశించారు.
జంపని గ్రామం వద్ద ప్రకృతి వ్యవసాయ రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు త్వరలోనే వ్యవసాయ సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం తెనాలి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి జిల్లా నుంచి వచ్చిన సమాచారం మేరకు రైతుల్లో భరోసా కల్పించేలా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఇదే మిల్లుకు అమ్మాలని రైతులకు నిబంధన ఉండేది..ఆ నిబంధన తొలగిస్తూ రైతులకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునే సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. గతంలో జీపీ ఎస్ విధానం ఉండేదని, ఈ ఐదు జిల్లాల్లో వాతావరణ ఇబ్బందులు కారణంగా జీపీఎస్‌తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించినట్లు వివరిం చారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో ధాన్యం కొనుగోలుపై రైతులకు మేలు జరిగేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులు తమ మొబైల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ఉపయోగించి వాట్సప్ ద్వారా ధాన్యం అమ్ము కోవచ్చు.. ఎప్పుడు అమ్ముకోవాలో కూడా నిర్ణయించుకోవచ్చని తెలిపారు. దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.