అమరావతి, చైతన్యరథం: రాజధాని అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీ సులను ఏపీ హైకోర్టు మంగళ వారం కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్లాట్లను రద్దుచేశారు. ప్లాట్లను రద్దు చేస్తున్నట్టు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారు లు 862 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు అన్యాయం అంటూ ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.
ప్లాట్లు రద్దు చేయడం అంటే సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. ప్లాట్ల రద్దు నిర్ణయం రాజధాని మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయ వాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ… చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మా సనం రాజధాని రైతులకు అను కూలంగా తీర్పునిచ్చింది. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన ప్లాట్ల రద్దు నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.