- లోకేష్ చొరవతో ఉపాధ్యాయులకు ఉపశమనం
- మరుగుదొడ్ల ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సిన పనిలేదు
- యాప్ నుంచి ఆప్షన్ తొలగిస్తున్నట్టు వెల్లడి
అమరావతి: ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విధానా న్ని ఆపేశామని, యాప్ నుంచి ఆ ఆప్షన్‌ను కూడా తొలగించామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేష్ పోస్ట్ చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందిం చాలని సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచిం చారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటా నని హామీ ఇచ్చారు.
హసీనాను స్వస్థలానికి తీసుకొస్తాం..
మరోవైపు సౌదీ అరేబియాలో చిక్కుకున్న మదనపల్లె ప్రాంత మహిళ షేక్ హసీనాబీను రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ హమీ ఇచ్చారు. ఆమెను స్వస్థలానికి చేర్చే బాధ్యత తీసు కుంటామని పేర్కొన్నారు. తాను పడుతున్న బాధలను వివరిస్తూ ఎక్స్ వేదికగా హసీనా పోస్ట్ చేసిన వీడియోపై లోకేష్ స్పందించారు.