అమరావతి: దేశ గణతంత్ర దినోత్సవ వేళ రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకి తమవుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరిం చారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. భద్రతా సిబ్బందికి చంద్రబాబు మిఠాయిలు పంచి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందని అంతకుముందు చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ మహనీయుడు రూపొందించిన రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశం నేడు గుర్తు చేసుకుంటోందన్నారు. ఈ శుభవేళ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో పేదరికంలేని సమసమాజ నిర్మాణానికి అందరం పునరంకితం అవుదామన్నారు.