- అటవీశాఖ అధికారులకు స్పీకర్ అయ్యన్న సవాల్
- కార్యక్రమం కాగితాలకే పరిమితమైందని అసంతృప్తి
- రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఎవరి అనుమతితో నరికారు?
- టింబర్ డిపోల్లో స్మగ్లింగ్‌కు కొంతమంది సహకారం
- వారిపై చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌వోకు వివరాలు
- రెడ్‌క్రాస్, గ్రీన్కాప్లను పునరుద్ధరించాలని సూచన
అనకాపల్లి(చైతన్యరథం): గత ఐదు నెలల్లో అటవీ అధికారులు 60 లక్షల మొక్కలు నాటినట్టు చెబుతున్నారని, అవి పూర్తిస్థాయిలో ఉన్నాయని నిరూపిస్తే తన పదవికి రాజీనా మా చేస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. వన మహోత్సవంలో భాగంగా అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్లో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 60 లక్షల మొక్కలు నాటినట్టు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి భిన్నమైన పరిస్థితులు న్నాయని తెలిపారు. మొక్కలు నాటడం కార్యక్రమం కేవలం కాగితాలకే పరిమితమవుతుం దని అసంతృప్తి వ్యక్తం చేశారు.
టింబర్ డిపోల్లో స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారు
నర్సీపట్నం అటవీ అధికారుల సహకారంతో టింబర్ డిపోల్లో పెద్దఎత్తున స్మగ్లింగ్ జరు గుతోందని అయ్యన్న తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలతో పాటు అవినీతికి పాల్పడే అధికారుల జాబితాను డీఎఫ్‌వోకు అందజేశారు. దీనిపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య రైతు తన పొలంలో వేప, టేకు చెట్టు పెంచు కుంటే నరికేందుకు అనుమతి కోసం అటవీ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. చెప్ప కుండా నరికితే ఎక్కువ ఫైన్ వేసి ఇబ్బందులు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాం లో రోడ్డు పక్కన ఇరువైపులా చెట్లను ఇష్టారాజ్యంగా నరికారు..వాటికి ఎవరి అనుమతులు తీసుకున్నారని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు చేసినప్పుడు చెట్లు నరికితే వాటిని తిరిగి పెం చేందుకు ప్రత్యేకంగా పనిలోనే నిధుల కేటాయింపు జరిగేలా అనకాపల్లి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని కోరారు.
రెడ్‌క్రాస్, గ్రీన్కాప్, ఎన్‌సీసీలను పునరుద్ధరించాలి
గతంలో తాను అటవీ మంత్రిగా ఉన్న సమయంలో రెడ్‌క్రాస్, గ్రీన్కాప్, ఎన్సీసీ వంటి విద్యార్థి విభాగాలతో ప్రత్యేకంగా ఒకేరోజు లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకునే వారమని గుర్తు చేశారు. ప్రస్తుతం వాటిని పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలను మొక్కల పెంపకంలో భాగస్వాములుగా చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు వద్దన్న కొన్ని జాతుల మొక్కలను నాటవద్దని తెలిపారు. అన్ని కళాశాలల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. వన మహోత్సవంలో భాగంగా మెడిసిన్ ప్లాంట్‌తో పాటు వెదురు వనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటికొక మొక్క నాటి పరిరక్షించాలి
ఇంటికొక మొక్క పెంచేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడాదికి పది శాతం మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటే ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పచ్చగా మారుతుం దని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి వారి ఇంటి పరిసరాల్లో ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ వారే తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారని, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుంద రపు విజయ్‌కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.