- ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క
- మరో 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
- భట్టి ` రెవెన్యూ, ఉత్తమ్ ` హోమ్, దుద్దిళ్ల శ్రీధర్ ` ఆర్థికం
- కొండా సురేఖ, సీతక్కలకు మంత్రవర్గంలో స్థానం
- సీనియర్లతో మంత్రివర్గం కూర్పు
- ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం
- చంద్రబాబు శుభాకాంక్షలు
ఎనముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా నిన్న మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ మరో 11 మంది చేత కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమమంతా హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీ జనం సమక్షంలో హర్షోల్లాసాల నడుమ జరిగింది. ఓపెన్ టాప్ జీపులో కాంగ్రెస్ మాజీ అధినేత సోనియాగాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి సభా వేదికకు చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రా, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమికి చెందిన నేతలు, పలువురు పార్లమెంట్ సభ్యులు, కొత్తగా ఎన్నికైన తెలంగాణ శాసనసభ సభ్యులు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు భారీ సంఖ్యలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
సీనియర్లే మంత్రులుగా
తెలంగాణ శాసనసభలో 119 సభ్యులుండగా నియమాల మేరకు మంత్రివర్గంలో 18 మంది ఉండవచ్చు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులంతా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులే. మొదటి విడతలో ప్రమాణ స్వీకారం చేసినవారంతా పరిశీలకులు, మీడియా ఊహించిన పేర్లే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడినవారికి, పార్టీ కోసం సీట్లను త్యాగం చేసిన కొంతమందికి మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని వార్తలు వచ్చినా మొదటి విడతలో గెలిచినవారే మంత్రులయ్యారు.
మంత్రుల శాఖలు
ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త మంత్రు లకు శాఖలు కేటాయించారు. వాటి వివరాలు :
సామాజిక కూర్పు
నిన్న ఏర్పడిన రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నలుగురు రెడ్లు, ఇద్దరేసి బీసీలు, ఎస్సీలు, ఒక ఎస్టీ, బ్రాహ్మణ, కమ్మ, వెలమ కులాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
ప్రమాణస్వీకారం చేసిన 12మందిలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మరో 10మంది తెలుగులో ప్రమాణ స్వీకా రం చేయగా.. దామోదర్ రాజనరసింహ ఆంగ్లంలో చేశారు. 11మంది దైవసా క్షిగా ప్రమాణం స్వీకరించ గా సీతక్క పవిత్ర హృద యం సాక్షిగా చేశారు.
రెండు ఫైళ్లకు ఆమోదం
ప్రమాణ స్వీకార కార్య క్రమం ముగిసిన వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన 6హామీలతో కూడిన ‘అభయహస్తం’అమ లుకు సంబంధించిన ఫైల్‌పై నూతన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మొదటి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాన్నిస్తూ రెండో సంతకం చేశారు.
రేవంత్‌రెడ్డికి పలువురు శుభాకాంక్షలు
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రజారంజకం గా పాలించాలని, ప్రజాసేవచేసే దిశలో భవిష్య త్తు విజయవంతంకావాలని తెదేపా అధినేత చం ద్రబాబు ఆకాంక్షించారు. రేవంత్‌రెడ్డి తమ బాధ్య తలు విజయవంతంగా నిర్వర్తించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆకాం క్షించారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా ఎన్నో ఒత్తి డులు ఎదుర్కొని, ఎన్నో పోరాటాలు చేసి సీఎం స్థాయికి ఎదిగారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, భారాస నేత హరీష్‌రావు, నంద మూరి రామకృష్ణ, ఇతర ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సంఖ్య మంత్రి పేరు శాఖ
1. భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ
2. ఉత్తమ్ కుమార్‌రెడ్డి హోం శాఖ
3. దామోదర రాజనరసింహ ఆరోగ్యం
4. కోమటి రెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖ
5. డాక్టర్ దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఆర్థిక శాఖ
6. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్
7. పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమం
8. కొండా సురేఖ బీసీ సంక్షేమం
9. ధనసరి అనసూయ సీతక్క గిరిజన సంక్షేమం
10. తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు, భవనాలు
11. జూపల్లి కృష్ణారావు పౌర సరఫరాలు