- ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్యం 1.04 కి ప్రమాణ స్వీకారం
- హాజరు కానున్న ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక
- చంద్రబాబు సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానం
- ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది మంత్రులు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజధాని హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితోపాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కోసం ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన అనంతరం రేవంత్‌రెడ్డి ఢల్లీి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను కలిశారు. పలువురు నేతలు మిఠాయి తినిపించి.. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రివర్గ కూర్పుపై పార్టీఅగ్రనేతలతో రేవంత్ చర్చలు జరిపారు. వరుస భేటీల అనంతరం గురు వారం మధ్యాహ్నం హైదరాబాద్ పయనమయ్యా రు. అయితే విమానాశ్రయానికి వచ్చాక, వెనక్కు రావాల్సిందిగా ఆయనకు హైకమాండ్‌నుంచి పిలు పు వచ్చింది. దీంతో విమానాశ్రయం నుంచి మహా రాష్ట్ర సదన్‌కు వెళ్లారు. ఇక్కడ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు, శాఖల కేటా యింపు వంటి కీలకఅంశాలపై చర్చించినట్లు తెలు స్తోంది.ఈ సమావేశంలో శ్రీధర్‌బాబు,షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, బలరాంనాయక్ కూడా పాల్గొన్నారు. ఈసమావేశం ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు మాణిక్ రావ్ ఠాక్రే కూడా హైదరాబాద్‌కు బయల్దేరారు. కొత్త మంత్రివర్గంలో సభ్యులు ఎవర నేది తెలియాల్సి ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఓడి పోయిన, సీటు త్యాగం చేసిన సీనియర్లకు కేబినెట్ లో ోటు కల్పించాలనే యోచనలో రేవంత్‌రెడ్డి ఉన్న ట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈజాబితాలో జీవన్ రెడ్డి,షబ్బీర్ అలీ,చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ ఉన్న ట్లుగా తెలుస్తోంది. ఒకేసారి పూర్తిస్థాయి మంత్రి వర్గాన్ని ప్రకటిస్తారా..తొలుతకొద్ది మందిని మంత్రి వర్గంలోకి తీసుకుని తరువాత విస్తరిస్తారా అనేది చూడాలి. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు రేవంత్‌తోపాటు 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారంచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, జీ వివేక్..జీ వినోద్‌ల్లో ఒకరు, దామోదర రాజనర్సిం హ,పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మల్‌రెడ్డి రం గారెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,షబ్బీర్ అలీ, జూపల్లి కృష్ణారావు,శ్రీహరి ముదిరాజ్,వీర్లబల్లిశంకర్,రేవూ రి ప్రకాశ్‌రెడ్డికి చోటు దక్కవచ్చునని తెలుస్తోంది.
హాజరు కానున్న అగ్రనేతలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి వస్తారని తెల ంగాణ కాంగ్రెస్‌వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి రానున్నారు. వీరిని రేవంతే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఢల్లీి నుంచి చాలా మంది ప్రముఖులు వస్తారని థాక్రే పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లో ని ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం జర గనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రజలంతా రావాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలి పించిన తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి కృతజ్ఞత లు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యా గం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైన దని హర్షంవ్యక్తం చేశారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గా లు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న, మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని రేవంత్ తెలిపారు. ఈ మహో త్సవానికి అందరికీ ఇదే ఆహ్వానం అంటూ రేవంత్ లేఖ రాశారు.
చంద్రబాబు నాయుడికి ఆహ్వానం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావా లంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి.. రేవంత్ ఆహ్వానం పంపా రు. ఆయనతోపాటు ఏఐసీసీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. తమిళ నాడు, ఏపీ సీఎంలు స్టాలిన్, జగన్‌తో పాటు, కాం గ్రెస్ గెలుపునకు కృషిచేసిన కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తదితర మంత్రులను ప్రమాణ స్వీకార మహోత్స వానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబా లకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. కాంగ్రెస్ ఎమ్మె ల్యేలతో పాటు, తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలం దరినీ ఆహ్వానించారు.మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మె ల్యేలకు కూడా ఆహ్వానం పంపించారు. టీజేఎస్ అధ్య క్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హర గోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సం ఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
ఏర్పాట్లు పర్యవేక్షించిన సీఎస్, డీజీపీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమా ణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా స్టేడియం లో ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్ట నున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ మేధావులు,ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేడియం బయ ట వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆమెకు ఉద్యోగం..సీఎం హోదాలో రేవంత్ తొలి సంతకం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మొదటి ఉద్యోగాన్ని ఓ దివ్యాంగు రాలికి ఇవ్వనుంది. గురువారం ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన అనంతరం రేవంత్‌రెడ్డి..రజని అనే యువతికి ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఉద్యో గం నీకే ఇస్తా మంటూ గత అక్టోబర్ నెలలో నాంపల్లికి చెందిన రజనికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను పీజీ పూర్తి చేసినప్పటికీ ప్రయి వేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వా న్ని ఏర్పాటుచేసే రోజున సోనియా గాంధీ, రాహు ల్ గాంధీ, ఖర్గే వస్తారని..వారి సమక్షంలోనే ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్‌హామీ ఇచ్చా రు. ఈ మేరకు ఆమెకు రేవంత్‌రెడ్డి గ్యారెంటీ కార్డు ను రాసి ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రజనికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రమాణ స్వీకారానికి రజనికి కూడా అహ్వానం పంపించారు.