ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి జిల్లాల వారీ ప్రగతి నిర్మాణం)
తెలుగువారి అభివృద్ధి, ఆనందం సదా కోరుకునే తెలుగుదేశం... తెలుగువారు ఉన్న ప్రతి ప్రాంతాన్ని సమదృష్టితో చూసింది. ప్రాంతీయ బేధాలు. కుల మత తారతమ్యాలకు తావు లేకుండా అందరికీ ప్రగతిని పంచి 'అభివృద్ధి వికేంద్రీకరణ'కు బాటలు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాను చూసినా ఇది తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి అని చెప్పుకునేలా పాలన కొనసాగించింది.
చిత్తూరు జిల్లా:
తిరుమల శ్రీనివాసుని పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన ఎన్టీఆర్... తిరుమల, తిరుపతిల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే 1983 ఏప్రిల్ 14న తిరుపతిలో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. అప్పటికి అది దేశంలోనే రెండవ మహిళా విశ్వవిద్యాలయం.
తిరుమలకు తరలివచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా ఉచిత అన్నప్రసాదాలు అందించేందుకు 1985 ఏప్రిల్ 6న నిత్యాన్నదాన పథకం ప్రారంభించారు.
దివ్యాంగుల కోసం బర్డ్ జైపూర్ తరహాలో టీటీడీ ఆధ్వర్యంలో 1985లో 'బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చి అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్' పేరిట (బర్డ్) వైద్య సంస్థను తిరుపతిలో ప్రారంభింపజేశారు ఎన్టీఆర్
టీటీడీ ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 1986లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)కు శంకుస్థాపన చేశారు ఎన్టీఆర్.
నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచీ చెన్నై నగర వాసులకు తాగునీరు అందించడమే లక్ష్యంగా 'తెలుగుగంగ' పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడా పథకం జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీటిని అందిస్తోంది.
రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఎన్టీఆర్ రెండు సాగునీటి పథకాలను ప్రవేశపెట్టారు. ఆ ప్రాజెక్టులే హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలు.
కృష్ణా జలాలను రాయలసీమకు అందించటంలో భాగంగా కర్నూలు జిల్లాలోని హంద్రీ , చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించటానికి 1989లో ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కర్నూలు జిల్లా మల్యాల వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి పేరుతో ఎత్తిపోతల పథకానికి ఎన్టీఆర్ పునాదిరాయి వేశారు.
ఆ తరువాత మళ్ళీ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సంకల్పంతో కృష్ణా జలాలు కర్నూలు జిల్లాలోని మల్యాల ఎత్తిపోతల నుండి అనంతపురం జిల్లాలోని చర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా చిత్తూరు జిల్లాలోని కుప్పంకు చేరాయి. దీంతో మదనపల్లి, పుంగనూరు మండలాలకు కృష్ణాజలాలు అందుబాటులోకి వచ్చాయి
ఇక రెండో ప్రాజెక్టు గాలేరు-నగరి సుజలస్రవంతి ప్రాజెక్టు.చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు.. తిరుమల, తిరుపతి, పుత్తూరు, నగరి పట్టణాలతో పాటు మరికొన్ని మండలాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. కడప జిల్లా గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఎన్టీఆర్... 1989లో గాలేరు నగరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. చేశారు.
2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గాలేరు నగరి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి పోతిరెడ్డిపాడు నుంచి గండికోట ద్వారా కడప జిల్లాతోపాటు చిత్తూరు జిల్లాలోని కొంత భాగానికి కృష్ణా జలాలను అందించింది
దేశంలోనే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ 'రూ.2లు కే కిలో బియ్యం' పథకాన్ని చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట నుండి ప్రారంభించారు.
పీలేరులో ఏపీ ఆయిల్ ఫెడరేషన్‌కు అనుబంధంగా శ్రీకృష్ణదేవరాయ సహకార నూనెవిత్తుల కర్మాగారం ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అది ప్రస్తుతానికి మూతపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక నారా చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా అయిన చిత్తూరుకు ఎన్నో పరిశ్రమలను తెచ్చారు. శ్రీ వెంకటేశ్వర మొబైల్ & ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దారు.
హీరో మోటోకార్ప్, ఫాక్స్‌కాన్ కంపెనీ, ఇసుజు మోటార్స్ వంటి సంస్థలను ఎన్నింటినో తెచ్చారు. 54 భారీ, మధ్య తరహా పరిశ్రమల ద్వారా 24,227 మందికి ఉపాధి కల్పించారు
రూ.1600 కోట్లతో తిరుపతికి స్మార్ట్ సిటీ మెరుగులు దిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు
చిత్తూరు జిల్లాలో పేదలకు 74,908 ఇళ్ళుకట్టించారు
చంద్రబాబు కృషితో తిరుపతిలో IIT, IISER, IIDT, ICI వంటి విద్యాసంస్థలు నెలకొన్నాయి
అనంతపురం జిల్లా:
దేశంలోనే భారీ విదేశీ పెట్టుబడులతో ఏర్పాటైన కియా మోటార్స్ పరిశ్రమ జిల్లాకు వచ్చిందంటే అది నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితం.
రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వమే. రూ.15,191 కోట్లతో పవన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.3,609 కోట్లతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది తెలుగుదేశమే
AHUDA ఏర్పాటు తెలుగుదేశం హయాంలోనే జరిగింది
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దింది చంద్రబాబు ప్రభుత్వం
జిల్లాలో రూ.553 కోట్లతో తాగునీటి పైపు లైన్లు, రూ.557 కోట్లతో 1856 కిమీల రోడ్లు, రూ.9,090 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది
చంద్రబాబు కృషితో జిల్లాకు సెంట్రల్ వర్సిటీ, NACEN వంటి విద్యాసంస్థలు వచ్చాయి
విశాఖపట్నం జిల్లా:
విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిద్దిడడానికి తెలుగుదేశం హయాంలో గట్టి ప్రయత్నం జరిగింది. ఐటీకి మణిహారం వంటి మిలీనియమ్ టవర్ ను గత తెలుగుదేశం ప్రభుత్వం నెలకొల్పింది
సెంట్రల్ పార్క్, తెలుగు సాంస్కృతిక నికేతనం వంటి పర్యాటక ఆకర్షణలు
విశాఖను ప్రపంచ ఫిన్ టెక్ మకుటంగా తీర్చిదిద్ధేందుకు రిషికొండలో ఫిన్ టెక్ టవర్ నిర్మించబడింది
దేశంలోనే మొదటి మెడ్‌టెక్ జోన్ ను విశాఖలో నెలకొల్పారు చంద్రబాబు
ఆసియన్ పెయింట్స్ వంటి ఎన్నో పరిశ్రమలు తెలుగుదేశం హయంలోనే విశాఖకు వచ్చాయి
విశాఖలోని IIM, పెట్రోలియం, ఇంధన వర్సిటీలు చంద్రబాబు కృషి ఫలితమే
కర్నూలు జిల్లా:
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సోలార్ పార్క్ ను కర్నూలో నెలకొల్పింది గత తెలుగుదేశం ప్రభుత్వం
రూ.670 కోట్లతో మెగా సీడ్ పార్క్ ను నెలకొల్పారు
18 నెలల్లో ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణం ఒక చరిత్ర
సీమ వరప్రదాయిని మచ్చుమర్రి ఎత్తిపోతల, పులకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించబడ్డాయి
జైన్ ఇరిగేషన్, కొలిమిగుండ్లలో సిమెంటు పరిశ్రమలు, జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఉక్కు పరిశ్రమ వంటి ఎన్నో పరిశ్రమలను కర్నూలు జిల్లాకు తెచ్చింది తెలుగుదేశం
ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు కృషి జరిగింది
కర్నూలుకు ఉర్దూ విశ్వవిద్యాలయం, IIIT విద్యాసంస్థలు రావడం చంద్రబాబు వల్లనే
తూర్పు గోదావరి జిల్లా:
1069 పంచాయితీలలో 4.1 లక్షల ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి దేశంలో 100 శాతం ఎల్ఈడీ దీపాలను కలిగి ఉన్న మొదటి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను తీర్చిదిద్దారు చంద్రబాబు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాలో రూ.812 కోట్లతో 1652 కి.మీ.ల రహదార్లు, రూ.314 కోట్లతో పంచాయితీలలో 1359 కి.మీ.ల రోడ్లు వేయడం జరిగింది
కాకినాడ సెజ్ లో హల్దియా పెట్రో రిఫైనరీ ఏర్పాటుకు కృషి జరిగింది
చంద్రబాబు చొరవతోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణం జరిగింది
రంపచోడవరంలో ఎల్ఈడీ బల్బుల తయారీ కేంద్రం నెలకొల్పి గిరిజనులకు ఉపాధి కల్పించారు చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా:
రాష్ట్రంలో 100 శాతం గ్యాస్ కనెక్షన్లున్న మొదటి జిల్లాగా, 100 శాతం విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లాగా, రాష్ట్రంలో తొలి ఒడిఎఫ్ జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాను తీర్చిదిద్దింది తెలుగుదేశం ప్రభుత్వమే
దేశంలోనే 100 శాతం సౌరవిద్యుత్తు పై ఆధారపడిన గ్రామం ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది తెలుగుదేశం హయాంలోనే
70 శాతం పోలవరం పనులు పూర్తి చేయడంతో పాటు జిల్లాలో పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తిచేసింది తెలుగుదేశం
పెదపాడు మండలంలో వెమ్ ఏరో సిటీ ఏర్పాటుకు కృషి జరిగింది
జిల్లాలో 2522 కి.మీ.ల సిమెంటు రోడ్లు తెలుగుదేశం కృషి ఫలితమే
పంటకాలువల పై సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం
శ్రీకాకుళం జిల్లా:
జిల్లాకు IIIT వచ్చింది తెలుగుదేశం హయాంలోనే
బొంతు ఎత్తిపోతల, వంశధార ప్రాజెక్ట్, హీరమండలం జలాశయం పనులు వేగిరం చేసింది తెలుగుదేశమే
శ్రీకాకుళం జిల్లాలో వంశధార - నాగావళి నదుల అనుసంధానంతో సాగునీటి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక వేశారు చంద్రబాబు.
ఉద్దానం సమస్యకు ఊరట కలిగిస్తూ 62 డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పారు. కిడ్నీ రోగులకు ప్రతి నెలా ఫించను ప్రారంభించారు.
గుంటూరు జిల్లా:
ప్రజా రాజధాని అమరావతిలో రూ.9000 కోట్ల నిర్మాణాలు చేపట్టింది తెలుగుదేశం
మంగళగిరిలో పై డేటా సెంటర్, హెచ్‌సీఎల్ వంటి 60కి పైగా ఐటీ కంపెనీలు తెలుగుదేశం హయాంలో వచ్చాయి
మంగళగిరిలో AIIMS , లాంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, National Institute of Disaster Management (NIDM), వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్), అమృత విశ్వవిద్యాలయం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్య, వైద్య సంస్థలు, విశ్వవిద్యాలయాలు జిల్లాకు వచ్చాయంటే అది చంద్రబాబు కృషి ఫలితమే
పశ్చిమ డెల్టాకు పట్టిసీమ జలాలు ఇచ్చినా, కొండవీటి వాగు ఎత్తిపోతలతో రాజధాని ప్రాంతానికి రక్షణ కల్పించినా అది చంద్రబాబు దార్శనికత ఫలమే
కొండవీటి కోట, కోటప్ప కొండల అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగింది
అవుకు టన్నెల్ ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాళెం జలాశయాలకు జలకళ తెచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం
పులివెందులకు సాగునీరు ఒక చరిత్ర
రూ.130 కోట్లతో ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధి
కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
రూ.27 కోట్లతో హజ్ హౌస్
పాపాగ్ని నదిలో హై లెవెల్ వంతెన నిర్మాణం
కృష్ణా జిల్లా:
పట్టిసీమతో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడింది తెలుగుదేశమే
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ( NID), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ ( CIPET ), NIDM వంటి సంస్థలు జిల్లాకు రావడం చంద్రబాబు కృషి ఫలితం
BEL (నిమ్మకూరు), హెచ్ సి ఎల్ డెవలప్మెంట్ సెంటర్, సాఫ్ట్ వేర్ టెక్ టవర్స్ (ఆటోనగర్)... వీటన్నినీ జిల్లాకు తెచ్చింది తెలుగుదేశమే
చింతలపూడి ఎత్తిపోతల తెలుగుదేశం హయాం లోనిదే
జక్కంపూడి ఆర్థిక నగరం, మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్, బందరు పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు వేసింది తెలుగుదేశమే
నెల్లూరు జిల్లా:
గమేశా విండ్ పవర్, క్రిభ్కో, బ్రేక్స్ ఇండియా ప్రై లిమిటెడ్, నెక్కంటి మెగా ఫుడ్ పార్కు, టాటా కెమికల్స్ లిమిటెడ్, గెస్టమ్ప్, అలెప్, భారత్ ఫోర్జ్ వంటి 56 భారీ పరిశ్రమలు జిల్లాకు వచ్చాయంటే అది చంద్రబాబు శ్రమ ఫలితమే. జిల్లాకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.42,225 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 44,819 మందికి ఉపాధి లభించింది
ESSO-NIOT, IIIT (శ్రీ సిటీ), IITTM వంటి విద్య సంస్థలు జిల్లాకు వచ్చింది తెలుగుదేశం హయాంలోనే
నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణం చేపట్టింది తెలుగుదేశమే
గత తెలుగుదేశం హయాంలో జిల్లాలో 2,093 కి.మీ.ల రోడ్ల నిర్మాణం, పేదలకు 3.37 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగాయి
గత తెలుగుదేశం ప్రభుత్వ కృషితో నెల్లూరు 2017లోనే ఒడిఎఫ్ జిల్లాగా ప్రకటించబడింది
ప్రకాశం జిల్లా:
జిల్లాలోని సుబాబుల్ రైతుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఎపిపి సినార్మస్ పేపర్ మిల్ కు కార్యరూపం ఇచ్చింది చంద్రబాబునాయుడే
దొనకొండలో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి బాటలు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం
దర్శిలో IDTR ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం
ఒంగోలులో IIIT (అబ్దుల్ కలాం) తెలుగుదేశం కృషి ఫలితం
కొరిశపాడు ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేసి వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది తెలుగుదేశం
రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు
ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పునరుద్ధరణ
జిల్లాలో ఫ్లోరైడ్ బాధల నుంచి విముక్తికి 3 మదర్ వాటర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది తెలుగుదేశం
విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లాలో 2003లో తాను శంకుస్థాపన చేసిన తోటపల్లి ప్రాజెక్టును తిరిగి తాను అధికారంలోకి వచ్చిన 2014 తర్వాతే రూ.774 కోట్లతో పూర్తిచేసి జిల్లాలో 52,214 ఎకరాలకు సాగునీరిచ్చారు చంద్రబాబు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. దత్తి రాజేరు రక్షిత మంచినీటి పథకం, సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం వంటివన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగాయి
కొత్తవలసను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్ధేందుకు కృషిచేశారు.
సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వంటి ప్రైవేటు విద్యాసంస్థలను విజయనగరం జిల్లాకు తెచ్చారు చంద్రబాబు. గిరిజన యూనివర్సిటీని తెచ్చేందుకు కేంద్రంతో పోరాడారు
రూ.248 కోట్లతో సింహాచల దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు.
సిగ్నేచర్ బ్రిడ్జి, పతంజలి ఫుడ్ పార్క్, 110 ఎకరాల్లో ఉద్యాన కళాశాల... ఇవన్నీ తెలుగుదేశం పాలనా ఫలితాలు
భోగాపురం విమానాశ్రయంతో జిల్లాకు వైభోగం తెచ్చేందుకు ప్రయత్నించింది తెలుగుదేశం