- చెరువుల మరమ్మతులు, తాగునీటి అవసరాలు తీర్చాలి
- మంత్రి నిమ్మలను కోరిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
విజయవాడ(చైతన్యరథం): అన్నమయ్య జిల్లాలో రైతులు, ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా పీలేరు మండిపల్లె నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లె రిజ ర్వాయర్‌లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసేందుకు రూ.156.60 కోట్లు మంజూరు చేయాలని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం విజయవాడలో జలవనరు ల మంత్రి నిమ్మల రామానాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండిపల్లి మాట్లా డుతూ రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి, సంబేపల్లి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం ఈ ఆరు మండలాల్లో చెరువుల మరమ్మ తు లు, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి అడవి పల్లె రిజర్వాయర్‌కు నీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో నీటి నిల్వలు పెరిగేలా జిల్లాలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.